ఇటీవలి కాలంలో స్వామీజీలు - భగవత్ ఆరాధకులు సానుకూల సమాచారం చేరవేయడం కంటే భయపెట్టే వార్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రీతిలో తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక విజయ దుర్గా పీఠాధిపతి గాడ్ అనే భగవత్ ఆరాధకుడు హెచ్చరికలు జారీచేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత దేశంలో అనేక విపత్కర పరిస్థితులు చోటు చేసుకోనున్నాయని, వీటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన - భగవరాధన చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండి అమ్మవారికి పంచ ద్రవ్యాలతో అభిషేకాలు - ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ప్రస్తుతం పాకిస్థాన్ తో యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు తర్వాత గత యాభై రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉన్నా తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితులను సామాన్యులు చవి చూస్తున్నారన్నారు. నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో కోల్డ్ వార్ ఏర్పడిందన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఉందోలేదో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని పూజించి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నప్పుడే ఆందోళనలు తొలగి, ఆనందం సిద్ధిస్తుందన్నారు. తొలుత పీఠాధిపతి గాడ్ సమక్షంలో నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ హెచ్చరికల విశ్వసనీయత ఎలా ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు మాత్రం కలకలం రేకెత్తిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/