లోకేశ్ 4 లక్షల కోట్ల స్కాం !!

Update: 2017-06-05 06:10 GMT
విశాఖ భూ కుంభకోణం రాష్ర్టాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో విపక్ష వైసీపీ ఒక్కటే కాదు పాలక టీడీపీ నేతలు - ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా ప్రభుత్వ పెద్దల వైపే వేళ్లు చూపిస్తున్నారు. దీంతో కచ్చితంగా దీనివెనుక వారే ఉన్నారని ప్రజలు కూడా నమ్ముతున్నారట. తాజాగా వైసీపీ ఎంపీ - ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా ఈ భూకుంభకోణంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనయుడు - ఏపీ మంత్రి లోకేశే దీనికి సూత్రధారి అని ఆయన ఆరోపించారు.
    
విశాఖ నగరం - చుట్టు పక్కల గ్రామాల్లో జరిగిన లక్ష ఎకరాల భూ కుంభకోణానికి వ్యతిరేకంగా త్వరలోనే విశాఖలో మహాధర్నా చేయనున్నట్టు ఆయన చెప్పారు. లక్ష ఎకరాల కుంభకోణాన్ని ప్రధాని, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ప్లీనరీకి హాజరైన విజయసాయిరెడ్డి … సుమారు  నాలుగు లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి చంద్రబాబు మార్గదర్శకంలో, లోకేష్ నడిపించారని ఆరోపించారు.
    
అంతేకాదు..... ఈ కుంభకోణంలో ఉన్న మంత్రులు - ఎమ్మెల్యేల పేర్లను ఆయన బయటపెట్టారు. మంత్రి గంటా శ్రీనివాసరావు - అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ - పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి - ఆయన కుమారుడు అప్పలనాయుడు - యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు - విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాత్ర ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక విశాఖ భూకుంభకోణం నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News