బాల‌య్య‌కు, బాబుకు పంచ్‌ల వ‌ర్షం కురిపించిన విజ‌యసాయిరెడ్డి

Update: 2018-12-05 12:59 GMT
వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోమారు త‌న ట్వీట్ల ప‌రంప‌ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ పై సెటైర్లు వేశారు. వ‌రుస‌గా చేసిన ట్వీట్ల లో ముందుగా బాల‌య్య‌పై సెటైర్లు వేసుకున్నారు. ``ఆంధ్రప్రదేశ్‌కు రా ...చూసుకుంటా. నా తడాఖా ఏంటో చూపిస్తా’! అంటూ బాలయ్య బాబు తొడగొడుతున్నాడంటే దయచేసి లైట్‌ గా తీసుకోవద్దు. కంటిచూపులతోను, కాలి గోరుతోను కాదు. ‘సంభ్రమాశ్చర్యాల’తో ఆయన ఎంతటి యోధుడినైనా అవలీలగా చిత్తు... చిత్తు చేయగలడు!`` అంటూ ఎద్దేవా చేశారు.

``మీ ప్ర‌భుత్వంలో చీఫ్ సెక్ర‌ట‌రీ గా ప‌నిచేసిన అజేయ క‌ల్లం చేసిన ఆరోప‌ణ‌ల‌ పై విచార‌ణ‌కు ఆదేశించే ధైర్యం ఉందా? మిస్ట‌ర్ సీఎం...మీ బినామీలు, చెంచాలు 600 మంది ఒక్కొక్క‌రు రూ.500 కోట్ల మేర‌కు లూఠీ చేశారు. మ‌రో 50 మంది ఒక్కొక్క‌రు రూ.100 కోట్ల చొప్పున సంపాదించారు. కాంట్రాక్టుల‌న్నీ మీకు కావాల్సిన ఐదు కంపెనీల‌కే. ఎన్నిక‌ల ముందే మీరెంత‌ నిప్పో నిరూపించుకోవాల‌ని ప్ర‌జ‌లంతా ఎదురుచూస్తున్నారు. ``అంటూ ఓ ట్వీట్లో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా బాబు రాజ‌కీయాల‌ను సైతం ఆయ‌న ఎద్దేవా చేశారు. ``వెన్నుపోటు, వంచ‌న‌, న‌మ్మ‌క‌ ద్రోహానికి మారుపేరైన టీడీపీ, ఏపీ, తెలంగాణ స‌హా ఏ రాష్ట్రంలో ఎక్క‌డ పోటీ చేసినా చిత్తుగా ఓడించాలి. గొర్రెల మంద‌లో దూరి అవ‌స‌రాన్ని బ‌ట్టి రంగులు మార్చే ప‌చ్చి అవ‌కాశ‌వాది రాజ‌కీయ‌వాది, ద‌ళారీ చంద్ర‌బాబుకు బ్యాలెట్‌తోనే గుణ‌పాఠం చెప్పాలి`` అని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తీరును విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. `మ‌ళ్లీ ఫ్ర‌స్టేష‌న్ పీక్‌కు చేరిన‌ట్లుంది నాయుడు బాబుకు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను వ‌దిలేసి బీజేపీ వైపు వెళ్తున్న‌ట్లు సంకేతాలిస్తున్న‌ట్లు అనుకోవాలా?  పార్టీలు ఫిరాయించిన వారిని గ‌ల్లంతు చేయ‌మ‌ని అన‌గ‌ల‌రా?  దొంగే దొంగ అని అరిచిన‌ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసిన మీరే ఫిరాయింపుదార్ల గురించి మాట్లాడ‌టం సిగ్గ‌నిపిస్తోంది``. అంటూ మండిప‌డ్డారు.


Tags:    

Similar News