ఏపీలో నేతల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఒకరి పై మరొకరు సోషల్ మీడియాలో సై అంటే సై అన్నట్టు సవాళ్లు విసురుకుంటున్నారు. సోషల్ మీడియా అంటే ఎక్కువగా గుర్తొచ్చేది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారే. ఆయన సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా మరోసారి ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు టార్గెట్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అప్పుడు వ్యవసాయం దండగ, ఉచిత కరెంటిస్తే వైర్ల పై బట్టలు ఆరేసుకోవడం తప్ప సరఫరా ఉండదని హేళన చేశాడు. సహకార పాల సంఘాలన్నిటిని దెబ్బకొట్టి తన హెరిటేజ్ డెయిరీని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు బినామీల భూముల కోసం రైతుల పేరుతో నాటకాలాడుతున్నాడు. వాటే విజన్ బాబ్జీ! అంటూ బాబు పై ఫైర్ అయ్యారు.
అలాగే, పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకమనుభవించిన మత్స్యకారులు సీఎం వైఎస్ జగన్ చొరవతో విడుదలవడాన్ని చంద్రబాబు ఓర్చుకో లేకపోతున్నారని , ఉత్తరాంధ్ర జాలర్లు సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని విమర్శించారు. సీఎం జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని రాష్ట్రంలో దాడులు, అరాచకాలు మొదలు పెట్టాడని ఆరోపించారు.
అలాగే ఈ రోజు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన జగనన్న అమ్మ ఒడి పథకంపై ఎంపీ విజయసాయి ప్రశంసలు కురిపించారు. అమ్మ ఒడి ఒక చరిత్రాత్మక పథకమని కొనియాడారు. రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికే దిక్సూచి అవుతుంది. 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఏటా 6,455 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం అసాధారణ విషయం. పిల్లలను స్కూలుకు పంపడం ఎవరికీ భారం అనిపించదు అని విజయసాయి ట్విట్టర్ వేదికగా తెలిపారు.