కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి సంబందించిన విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి .. బడ్జెట్ లోని కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించటం గమనార్హం. ఏపీ పరంగా చూసినప్పుడు బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. బడ్జెట్ మీద పెట్టుకున్న ఆశలు నీరుకారిపోయిన భావన విజయసాయి రెడ్డి స్పందన చూస్తే అర్థం కాక మానదు. ఆచితూచి అన్నట్లు మాట్లాడుతూనే.. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్న విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టేసేందుకు వెనుకాడలేదు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ తనకు నిరాశ కలిగించిందన్నారు. ఏపీకి సాయం చేస్తానన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదన్న మాటను చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు.. రాజధాని ప్రస్తావన లేని విషయాల్ని ప్రస్తావించారు.
బడ్జెట్ ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదన్న ఆయన.. కార్మికులకు పెన్షన్ల ప్రకటనను తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎన్ ఆర్ ఐలకు ఆధార్ కార్డులు ఇవ్వటం మంచిదేనని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించటం మంచిది కాదన్న ఆయన.. పారిశ్రామిక రంగానికి ఏం చేస్తారన్న దానిపై బడ్జెట్ లో స్పష్టత ఇవ్వలేదన్నారు.
బడ్జెట్ పై విజయసాయి చేసిన మరిన్ని వ్యాఖ్యలు చూస్తే..
+ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారన్న దానిపై స్పష్టత లేదు.
+ గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏపీ రెవెన్యూ లోటు రూ.60వేల కోట్లకు పెరిగింది. ఈ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది.
+ కేంద్రం తానిచ్చిన హామీల్ని నెరవేర్చుకోలేదు. పోలవరం.. అమరావతిపై నిధుల ప్రస్తావన లేదు.
+ ఏపీ ప్రయోజనాలు కాపాడుకోటం కోసం మేం ఏ పోరాటానికైనా సిద్ధమే. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్నిపార్లమెంటులో ప్రశ్నిస్తాం.
+ విజయవాడ విశాఖ మెట్రో రైలుకు నిధుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది. భారతమాల - సాగరమాల తదితర పథకాలలో ఏపీకి ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టత లేదు.
+ డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి పథకాలకు ఓవర్ డ్రాఫ్ట్ 5000 ఇవ్వడం స్వాగతించదగ్గ విషయం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా రహస్యంగా చేస్తున్నారు. మిగతా ప్రభుత్వరంగ సంస్థలను ఇబ్బంది పెట్టి ఎయిరిండియాకు నిధులు సమకూర్చడం మంచిది కాదు.
+ జీరో బడ్జెట్ వ్యవసాయంపై స్పష్టత లేదు. స్వచ్ఛభారత్ ఆచరణలో పెద్దగా అమలు కావడం లేదు. చిన్న వర్తకులకు పెన్షన్ - అందరికీ ఇళ్ల పథకాలు అభినందనీయం.