ఆ రోజుల్లో కేసీఆర్ ఎన్నోసార్లు మొహం చాటేస్తే ... రాముల‌మ్మ షాకింగ్ కామెంట్స్

Update: 2021-04-16 06:11 GMT
తెలంగాణ లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రచార పర్వం కూడా ముగియడంతో పోలింగ్ కి ఈసీ అన్ని ఏర్పాట్లని పూర్తి చేస్తుంది. ఇదిలా ఉంటే..ఎన్నికల పోలింగ్ కి కొద్ది గంటల ముందు కూడా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీఆర్ ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ , అలాగే జానారెడ్డి పై పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు బీజేపీ నేత విజ‌య‌శాంతి. సాగర్ ఉప ఎన్నిల్లో అధికార గులాబీ పార్టీకి ఓటమికి భయం పట్టుకుందని, హాలియా ప్రచార సభలో ఈ అంశం స్పష్టంగా కనిపించిందని విజయశాంతి  అన్నారు.  సీఎం ప్రసంగంలో కొత్తదనం లేదని దుబ్బాక తరహాలోనే ప్రజలను మభ్య పెట్టేప్రయత్నం చేసారు తప్ప మరోటిలేదని ఘాటుగా విమర్శించారు.

రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కూలిపోతుందని  జోస్యం చెప్పారు. ఈ విషయం చంద్రశేఖర్ రావు కళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోందని, అంతే కాకుండా చంద్రశేఖర్ రావు పైకి కనిపించేంతటి ధైర్యం ఉన్న నాయకుడు కాదని, ఉద్యమ సమయంలో చాలాసార్లు పారిపోయారని గుర్తుచేసారు. తన బహిరంగ సభలకు ఆ రోజుల్లో ఎన్నోసార్లు మొహం చాటేస్తే చంద్రశేఖర్ రావును ఒప్పించి సమావేశాలకు పిలుపించుకున్న సందర్బాలు ఉన్నాయని అన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను చావుకు దగ్గర చేశారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రాన్ని కేసీఆర్ అనాథాశ్రమంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రావుతో పాటు జానారెడ్డిలు తోడు దొంగలని, వారు తెర వెనక మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే పన్నెండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ ఎస్ లో చేరారని పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి హెచ్చరికలు జారీచేసారు. మంచివాళ్లు అంటే, బీజేపీవాళ్లే కానీ, టీఆర్ ఎస్ నేత‌లు కాద‌న్నారు, కేంద్రం ఇచ్చే నిధుల‌ను కూడా ప‌క్క‌దారి ప‌ట్టించి, ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా కుట్ర చేశార‌ని మండిప‌డ్డారు. హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం చంద్రశేఖర్ రావు పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని , రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం చంద్రశేఖర్ రావు ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, సీఎం చంద్రశేఖర్ రావు దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని అభిప్రాయపడ్డారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని విజయశాంతి గుర్తుచేశారు.
Tags:    

Similar News