ఆశలకు హద్దు ఉంటుంది. సొంత బలాన్ని తెలుసుకోలేని అధినాయకుడు ఎప్పటికి ప్రజలకు నాయకుడిగా మారలేడు. ఆ చిన్న విషయాన్ని గుర్తించటంలో చాలామంది అధినేతలు తప్పులో కాలేస్తుంటారు. తాజాగా ఆ లిస్ట్ లోనే చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి తమిళనాడులోని డీఎండీకే అధినేత.. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ తీరు చూస్తుంటే.
కొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని అవసరానికి మించి ఎక్కువగా ఊహించుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అమ్మ బ్రాండ్ తో చెలరేగిపోయి.. సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పి జయలలిత.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతుంటే.. మరోవైపు దెబ్బ తిన్న బెబ్బులిగా గర్జించాలని డీఎంకే ఆశ పడుతోంది. మధ్యలో ములక్కాయ లాగా విజయకాంత్ తానే కింగ్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న పరిస్థితి.
అన్నా డీఎంకే.. డీఎంకే బలాల్ని చూసినప్పుడు విజయకాంత్ బలం పరిమితమే. పోటాపోటీగా సాగనున్న తాజా ఎన్నికల్లో విజయకాంత్ ఏ వర్గం వైపు ఉంటే.. ఆ వర్గానికి విజయం సులువు కానుంది. అదేసమయంలో.. విజయకాంత్ సొంతంగా చెలరేగిపోయే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలో అతడితో పొత్తు కోసం అటు బీజేపీ.. ఇటు డీఎంకే చాలానే ప్రయత్నాలు చేసింది. అయితే.. తాను కింగ్ మేకర్ గా ఉండటం ఇష్టం లేదని.. కింగ్ గా ఉండటమే ఇష్టంగా ఆయన చెబుతున్నారు. సొంత బలం మీద విపరీతమైన అంచనాలు వేసుకుంటూ.. వాస్తవాన్ని మరుస్తున్న ‘‘కెప్టెన్’’ కింగ్ కావటం కష్టమంటున్నారు. కింగ్ మేకర్ ని కావటం ఇష్టం లేదన్న ఆయన కింగ్ కాకుంటే కాకపోయారు.. బొంగు మాత్రం కాకూడదన్న వాస్తవాన్ని ఆయన మిస్ అవుతున్నారే..?