డీఎండీకె చీఫ్ విజయ్ కాంత్...తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన రాజకీయవేత్త. సినీనటుడు దక్కిన చరిష్మాతో ఓట్లు కొల్లగొట్టేదామనుకున్న ఆయన ఆశ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. అయితే దాన్నేమాత్రం పట్టించుకోకుండా తన అభిమానులకు ఓ తీపికబురు అందించారు. తన సినిమా జీవితం గురించి ఆయన తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
తన రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేని రీతిలో తీవ్రంగా భంగపడినప్పటికీ దాన్నుంచి వెంటనే తేరుకున్న విజయ్ కాంత్ తాజాగా సరికొత్త వార్తను ట్వీట్ చేశారు. తన 155వ చిత్రం ''నువ్వు తమిళుడవని చెప్పు' షూటింగ్ తిరిగి ప్రారంభమవుతోందని దానితో తాను బిజీ అవుతానని చెప్పారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత పూర్తి స్థాయి పాత్రతో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. గతేడాది తన కుమారుడి తొలి చిత్రంలో కాసేపు అతిథి పాత్రలో కనిపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే కెప్టెన్ తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులను పలకరించడంతో ఆయన అభిమానులు తమకు ఇది మంచి వార్తేనని సంబరపడుతున్నారు.
మరోవైపు గోరుచుట్టుపై రోకటి పోటులా తాజాగా జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతై నిండా బాధలో మునిగిపోయిన విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే ఏకంగా రాజకీయ పార్టీ హోదా రద్దయ్యే ప్రమాదం ముంచుకువస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీగా నిలబడాలంటే కనీసం 6 శాతం ఓట్లు పడాలి. డీఎండీకేకి కేవలం 2.4 శాతం వోట్లు పడడంతో ఆ పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. 2011 ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లు గెలుచుకుని చక్రం తిప్పిన విజయ్ కాంత్ తన ప్రవర్తనతో దారుణంగా ఓటమి పాలయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధితో పొత్తు పెట్టుకుని ఉంటే కెప్టెన్ భవిష్యత్ మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.