గౌతమ్ భార్యకు విజయమ్మ, షర్మిల ఓదార్పు

Update: 2022-02-21 08:30 GMT
గుండెనొప్పితో హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తిని ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. భార్యతో మాట్లాడుతునే ఛాతి నొప్పి కారణంగా సోఫాలో నుండి కిందపడిపోయిన గౌతమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. భర్త మృతదేహంతో పాటు ఆసుపత్రిలోనే ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యుల బాధను చూసి అందరు చలించిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే వైఎస్ విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిల వచ్చి శ్రీకీర్తిని ఓదార్చారు.

వాళ్ళిద్దరు మంత్రి భార్య దగ్గరే చాలా సేపు కూర్చున్నారు. భర్తతో తన మధుర క్షణాలను నెమరేసుకున్న భార్య చివరి క్షణాలను కూడా గుర్తు చేసుకున్నారు. తాము కష్టాల్లో ఉన్నపుడు మేకపాటి కుటుంబం తమకు అండగా ఉన్న విషయాన్ని విజయమ్మ, షర్మిల గుర్తుచేశారు. తాము కూడా మేకపాటి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీళ్ళ విషయం ఇలాగుంటే చెట్టంత కొడుకుని పోగుట్టుకున్న తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని, తల్లిని షాక్ కు గురిచేసింది.

వీళ్ళని కూడా విజయమ్మ, షర్మిల ఓదార్చే ప్రయత్నం చేశారు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ఆసుపత్రికి వచ్చారు. కేవీపీ కూడా మేకపాటి దంపతులను ఓదార్చారు. గౌతమ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. తనను రెగ్యులర్ గా కలిసే గౌతమ్ వైసీపీలో చేరాలంటు రెండు, మూడు సార్లు ఫోర్స్ చేసినట్లు చెప్పారు. అయితే వరస విజయాలు సాధిస్తున్న వైసీపీకి తన అవసరం లేదని తాను చెప్పినట్లు కేవీపీ చెప్పారట.

యువకుడు, ఉత్సాహవంతుడైన గౌతమ్ లాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరమని కేవీపీ చెప్పారు. వివాదరహితంగా, అందరితోను సన్నిహితంగా ఉండే గౌతమ్ చనిపోయారంటేనే నమ్మకం కలగటం లేదని కేవీపీ చెప్పారు. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా చెప్పారు. ఎంతో భవిష్యత్తున్న యువ మంత్రి గౌతమ్ హఠాత్తుగా మరణించటం చాలా బాధాకరమని జేసే పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులంతా ఆసుపత్రికి వచ్చి గౌతమ్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

 

    

Tags:    

Similar News