విజయనగరం.. మంత్రం బొత్స సత్యానారాయణ సొంత జిల్లా. ఆయనకు కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని జి ల్లాగా ఉన్న ప్రాంతం. అయితే.. ఇప్పుడు ఆయనపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్టాడుతూ.. తనపై వోక్స్ వ్యాగన్ ఆరోపణలు తప్ప.. ఏమీ లేవని.. వివరణ ఇచ్చుకునే వరకు పరిస్థితి వచ్చిందంటే.. విజయనగరంలో ఏం జరుగుతోందో.. అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుండడం గమనార్హం. విషయం సీరియస్‌గానే ఉందని.. స్థానిక వైసీపీ నేతల మధ్య కూడా చర్చ సాగుతోంది. భూముల కబ్జాకు సంబంధించిన ఆరోపణలు ఇప్పుడు... మంత్రి చుట్టూ హల్చల్ చేస్తున్నాయి.
విజయనగరం జిల్లా సత్యసాయినగర్ లేఅవుట్‌లో ప్లాట్లు కొన్నవారు.. కొందరు... తమ స్థలాలను.. మంత్రి బొత్స బంధువులు కబ్జా చేస్తున్నారని.. లబోదిబోమంటున్నారు. తమ నిర్మాణాలను ఏ క్షణంలోనైనా తొలగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వారు అంటున్నారు. ఇదే విషయాన్ని విజయనగరం ఆర్డీవో భవానీశంకర్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా మంత్రిపై ఆరోపణల పర్వం... గురించి విమర్శలు వస్తున్నాయి.
అసలు ఏం జరిగింది?
విజయనగరం బిట్-1 తోటపాలెం పరిధి సర్వే నెంబరు 53-4, 53-5లో రైల్వే ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వారు 1982వ సంవత్సరంలో సత్యసాయినగర్ పేరుతో ఇళ్ల స్థలాలను లేఅవుట్ చేశారు. ఇందులోని ప్లాట్లను సుమారు 70 మంది కొనుగోలు చేశారు. ప్లాట్లు కొన్న వారిలో కొంతమంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. మరికొంతమంది ఫెన్సింగ్ వేసుకున్నారు. అయితే ఈ భూములు తమవేనని, వాటిని ఖాళీ చేయాలంటూ బొత్స గురునాయుడు కుమారుడు బొత్స ఆదినారాయణ తదితరులు.. బాధితులను ఆ స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు 2015 నుంచీ జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మార్వో కూడా ఈ స్థలాలు తమకే చెందుతాయని చెప్పారని, అయినా బొత్స కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తాము కోర్టుకు కూడా వెళ్లామని బాధితులు తెలిపారు.
ఈ క్రమంలో గత నెల 28న 53-4, 53-5 సర్వే నెంబర్లు గల భూమిని పల్లం భూమిగా చూపించి ఆదినారాయణ సోదరుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరుతో ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డులను అధికారులు మార్చేశారని బాధితులు తెలిపారు. ఇళ్ల స్థలాలుగా రికార్డుల్లో నమోదై ఉన్న భూమిని పల్లం భూమిగా చూపి పట్టాదారు పాసుపుస్తకం ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నించారు.
ఈ స్థలాలకు మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్నులు కూడా చెల్లించామని, అయినప్పటికీ పల్లంభూమిగా వెబ్‌ల్యాండ్‌లో ఎలా మార్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన వారిలో పి.విజయలక్ష్మి, కస్తూరీబాయి, కలిదిండి ఆంజనేయులు, కలిదిండి రామభద్రరాజు, లెంక శ్రీనివాసరావు, ఏటుకూరి పద్మజ, కె.ఎ్‌స.ఎన్. వర్మ ఉన్నారు. దీంతో ఇప్పుడు మంత్రి చుట్టూ వివాదం ముసురుకుంది. అయితే.. మంత్రి మాత్రం తనకు సంబంధం లేదని...వాదిస్తున్నారు.మరి బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.