దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరు. ఇపుడు ఇది అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న. 2017లో ఇదే నెలలో 18వ తేదీ నాటికే రాం నాద్ కోవింద్ తమ అభ్యర్ధి అని బీజేపీ డిక్లేర్ చేసింది. ఇపుడు 20 దాటినా ఇంకా సైలెంట్ గానే ఉంది.
కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో ఈపాటికే ఆ పార్టీ వారికే కాదు, మద్దతుగా నిలిచే వారికి కూడా తెలిసిపోయింది అంటున్నారు. దానికి ఉదాహారణ వైసీపీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి తాజాగా చత్తీస్ ఘడ్ వెళ్ళి అక్కడ రాజ్ భవన్ లో గవర్నర్ అనసూయా ఉయికేని కలసుకొవడం. ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి మరీ అభినందించడం.
నిజంగా ఇది ఆసక్తిని రేపే అంశమే. విజయసాయిరెడ్డి హఠాత్తుగా చత్తీస్ ఘడ్ ఎందుకు వెళ్లారు. రాజ్ భవన్ లో ఉన్న గవర్నర్ అనసూయను ఎందుకు కలిశారు అంటే అనేక ఊహాగానాలు వచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపించేది ఆమె కాబోయే రాష్ట్రపతి అని. ఆమె పేరునే బీజేపీ హై కమాండ్ డిసైడ్ చేసిందని, ఆ వార్త చెవిన సోకడం వల్లనే విజయసాయిరెడ్డి వెళ్లి మరీ కలసి అందరి కంటే ముందుగా ఆమెను అభినందించారు అని.
ఇక్కడ చూస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకు వస్తుంది. అదేంటి అంటే సరిగ్గా అయిదేళ్ల క్రితం 2017లో అప్పటి బీహార్ గవర్నర్ గా ఉన్న రాం నాధ్ కోవింద్ ని కూడా రాజ్ భవన్ కి వెళ్ళి మరీ విజయసాయిరెడ్డి కలిశారు. ఆయన్ని అభినందించి వచ్చారు. ఆ తరువాతనే ఆయన పేరు అధికారికంగా ప్రకటించారు. ఇపుడు కూడా సేమ్ టూ సేమ్ సీన్ అనసూయ విషయంలోనూ జరుగుతుంది అంటున్నారు.
ఇక అనసూయ విషయానికి వస్తే ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఉమ్మడి మధ్యప్రదేశ్ లో ఆమె 1985లో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నెగ్గారు. నాటి ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ నాయకత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2006లొ రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 2019 లో చత్తీస్ ఘడ్ కి గవర్నర్ గా నియమితులయ్యారు. ఇపుడు ఆమెకి రాష్ట్రపతి భవన్ లో కొలువు తీరే సువర్ణ అవకాశం దక్కబోతోంది అని అంటున్నారు.
ఇక బీజేపీ అభ్యర్ధికే మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే వైసీపీ హామీ ఇచ్చింది. మహిళ అందునా గిరిజన వర్గానికి చెందిన ఆమెకు మద్దతు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి ఓటు వేశామని చెప్పుకోవడానికి వైసీపీ చూస్తోంది. మొత్తానికి ఏదైనా భారత కొత్త రాష్ట్రపతి ఎవరో తేలిపోయింది. విజయసాయిరెడ్డి ఆ సీక్రెట్ ని బయటపెట్టేశారు.