ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిజంగానే తన వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదని మరోమారు తేలిపోయింది. ఓ వైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే... ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సి నిధులను కూడా చాలా డేర్ గానే ప్రస్తావించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ సమావేశమైనా... ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యమన్న రీతిలో వైసీపీ సాగుతోంది. మొత్తంగా వేదిక ఏదైనా,ప సమయం ఏదైనా, సందర్భం ఏదైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న రీతిలో వైసీపీ సాగుతోంది. ఇందుకు నిదర్శనమే... గురువారం ఢిల్లీ వేదికగా మోదీ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరు అని చెప్పాలి.
ఓ వైపు కేంద్రం ప్రతిపాదించిన సీఏఏ, ఎన్నార్సీలను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పిన వైసీపీ... మరో వైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ అంశాలను కూడా చాలా డేర్ గా ప్రస్తావించింది. కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైసీపీ తరఫున పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. తొలుత కేంద్రం ప్రతిపాదించిన సీఏఏ, ఎన్నార్సీ చట్టాలను మిథున్ రెడ్డి ప్రస్తావించారు. వివాదాస్పద ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలను తాము వ్యతిరేకిస్తున్నామని కుండబద్దలు కొట్టేసిన మిథున్ రెడ్డి... ఈ చట్టాల ద్వారా దేశంలోని మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిందని చెప్పారు. మైనార్టీలకు తాము అండగా ఉంటామని, ఎన్పీఆర్ లో అడుగుతున్న సమాచారం గతం కంటే భిన్నంగా ఉందని, ఈ అంశాల అన్నింటిపై పార్లమెంటులో విసృతంగా చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.
ఈ తర్వాత మైకందుకున్న సాయిరెడ్డి... ఏపీకి ప్రత్యేక హోదా, ఇతరత్రా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తనదైన శైలిలో వరుసపెట్టి డిమాండ్లు వినిపించారు. ‘‘విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. కాగ్ ఆడిట్ ప్రకారమే రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలి. రాజధానిలో మౌలిక వసతులకు తగిన నిధులు కేటాయించాలి. రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలి. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18, 969 కోట్ల బకాయిలు విడుదల చేయాలి. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను తిరిగి ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలి. క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలి. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలి’’ అని సాయిరెడ్డి వరుస పెట్టి ఏపీ డిమాండ్లు మొత్తాన్నిఏకరువు పెట్టారు.