ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - ఆయన తనయుడు లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెన్నుపోట్లకు ప్రసిద్ధుడైన చంద్రబాబు మోడీని వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడైన ఎన్ టీఆర్ ను సైతం బాబు వెన్నుపోటు పొడిచాడని గుర్తు చేశారు. మామను మోసం చేసిన బాబు మోడీకి కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఆయన అన్నారు.
చంద్రబాబు తనయుడు లోకేశ్ విశాఖ ఎందుకు వస్తున్నారన్నది ఆయన చెప్పుకొచ్చారు. భూవ్యవహారాలను చక్క పెట్టుకోవడానికే లోకేశ్ విశాఖ వస్తున్నారని ఆయన ఆరోపించారు. భూవ్యవహారాలు - కుంభకోణాలకు సంబంధించి అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు - లోకేశ్ ల కనుసన్నల్లోనే విశాఖ భూ కుంభకోణం మొత్తం జరిగిందని ఆయన ఆరోపించారు. స్థానిక నేతలను అడ్డంపెట్టుకుని మొత్తం కథ నడిపించింది వారేనని ఆయన మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను అడ్డగోలుగా కొట్టేస్తున్నారని విరుచుకుపడ్డారు.
విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గంలో జరిగిన మినీ ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నామని నేతలు రెచ్చిపోతున్నారు. అంతేకాక రైతుల వద్ద భూములను తీసుకుని భూదందాలకు పాల్పడుతున్నారనీ ఆరోపించారు. రాష్ర్టంలో దందాలు నడుస్తున్నాయని... పాలన లేదని విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/