బాబు అందించిన దుర్మార్గ‌పు కానుక ఇది!

Update: 2018-11-02 20:34 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్వార్థానికి ఏపీ ప‌రువు గంగ‌పాలు అయింద‌ని వైసీపీ ఎంపీ - పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయి రెడ్డి మండిప‌డ్డారు. ఏపీ పోలీసుల‌ను ఎన్నిక‌ల‌కు వాడుకునేది లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స్ప‌ష్టం చేయ‌డం ఏపీకి జ‌రిగిన అవ‌మాన‌మ‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. రాష్ర్టాన్ని గాలికి వ‌దిలేసి తెలంగాణ‌లో ఇంటెలిజెన్స్ పోలీసుల‌ను పెట్టిన రాజ‌కీయ స్వార్థం బ‌ట్ట‌బ‌య‌లు అయింద‌ని, అందుకే ఈసీ పోలీసుల‌ను వాడుకోబోమ‌ని వెల్ల‌డించింద‌ని విజ‌య సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేసేలా ఓటుకు నోటు కేసులో కోట్లాది రూపాయ‌లతో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ చంద్ర‌బాబు దొరికిపోయార‌ని విజ‌య‌ సాయి రెడ్డి గుర్తు చేశారు. `ఎమ్మెల్యేల కొనుగోలులో దొరికిపోయిన‌ప్ప‌టికీ - బాబు త‌న బుద్ధి మార్చుకోలేదు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర పోలీసుల‌ను అక్క‌డ వాడుకునేందుకు ఎత్తుగ‌డ వేశారు. ముగ్గురు ఆంధ్రా పోలీసుల‌ను తెలంగాణ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకున్నారు. దీన్నీ ఈసీ సీరియ‌స్‌ గా తీసుకుంది. దీంతో ఈ చ‌ర్య ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గుర్తించి ఈసీ మ‌న పోలీసుల‌ను తిర‌స్క‌రించింది. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు ఎన్న‌డూ జ‌ర‌గ‌లేదు. ఈ చ‌ర్య‌కు కార‌ణ‌మైన బాబు తిరిగి ఈసీ తీరును నిందించ‌డం ఏమిటి? ఇదేనా చంద్ర‌న్న కానుక‌? ఈ దుర్మార్గ‌పు ముఖ్య‌మంత్రి పాల‌న‌లో ఇంకెంత కాలం ఆంధ్ర రాష్ట్ర ప్ర‌ళు అవ‌మానాల పాలు కావాల్సి ఉంటుంది? ఇదేనా ఈయ‌న ప్ర‌జ‌ల‌కు ఇచ్చే కాను`` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ - చంద్ర బాబుల స్నేహ బంధంపై ఆయ‌న ట్విటర్‌ ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు. కొంచెం కూడా సిగ్గూ శరం లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అదే చంద్రబాబేనని విమర్శించారు. పొలిటికల్‌ దళారి చంద్ర బాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని మండిప‌డ్డారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాక్షసి అని - కాంగ్రెస్‌ ను బొంద పెట్టాలని - తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడని చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కాపాడుదామని అంటున్నారని దుయ్యబట్టారు.



Tags:    

Similar News