డైలీ బేసిస్ లో ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు ట్వీట్లతో చుక్కలు చూపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా మరోసారి చెలరేగిపోయారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లను చూస్తే.. బాబు తప్పుల చిట్టా ఆయన బాగానే మొయింటైన్ చేస్తున్నట్లుగా చెప్పాలి. తాజాగా కుప్పం పర్యటన సందర్భంగా బాబు నోటి నుంచి వచ్చిన మాటలకు దిమ్మ తిరిగిపోయేలా ట్వీట్ వాతలు పెట్టారని చెప్పాలి.
అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని.. అలివి కానీ వరాలతో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న చంద్రబాబు మాటలపై విజయసాయి రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమట.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయటం వీలుకాదట.. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్లుగా సెలవిచ్చారు. అన్న మాట ప్రకారం జగన్ చేసి చూపిస్తారు.. మీరూ చూస్తారంటూ ధీమాను వ్యక్తం చేశారు.
వాస్తవానికి ఈ విషయంలో బాబు తప్పే చేశారని చెప్పాలి. జగన్ ప్రభుత్వం కొలువు తీరి నెల మాత్రమే అయిన వేళ.. ఆర్నెల్ల వరకూ ప్రభుత్వ విధానాల్ని సమీక్షించి వ్యాఖ్యానించటం ధర్మంగా చెప్పాలి. అందుకు భిన్నంగా నెలకే తీర్పులు చెప్పేయటం అంత బాగోదు. ఆ విషయంలో బాబు తొందరపాటును ప్రదర్శించారని చెప్పక తప్పదు.
ఇక.. బాబు అద్దెకు ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ పైన విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.. "లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?" అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబును విమర్శించటం సరికాదంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి పంచ్ వేశారు. చంద్రబాబు గారేమో ఆకాశమంట.. లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు.. అందనంత స్థాయి అని మీకు మీరే పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా? అంటూ వ్యంగ్యంగా పంచ్ విసిరారు విజయసాయి. ఏమాటకు ఆ మాట తండ్రికొడుకులు ఇద్దరు తమ మాటలతో విజయసాయి రెడ్డి కి ట్వీట్ పంచ్ లు విసిరే అవకాశం ఇస్తున్నారని చెప్పకతప్పదు.