ఏపీలో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిపోయింది. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఫలితాల కోసం మాత్రం ఇంకో 38 రోజులు మాత్రం వేచి చూడక తప్పని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇటు అధికార పార్టీ టీడీపీతో పాటు అటు విపక్ష వైసీపీ కూడా తమదే గెలుపు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే వైసీపీలో కనిపిస్తున్న జోష్ టీడీపీలో కనిపించడం లేదన్న మాట బాగానే వినిపిస్తోంది. ఓటమి ఖాయం చేసుకున్న టీడీపీ... అసలు విషయాలను వదిలేసి కొసరు విషయాలతో నానా రచ్చ చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయమే ఉన్నా... అప్పుడే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను సీఎంను అయిపోయానని, ఇంకెందుకు ఆలస్యం అంటూ ఏకంగా తాను సీఎంగా అయినట్టు నేమ్ ప్లేట్ ను కూడా తయారు చేయించుకున్నారని నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై నిన్న మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... ,జగన్ పై విరుచుకుపడ్డారు. ఫలితాాలు రాకుండానే నేమ్ ప్లేట్ తయారు చేయించుకుంటారా? అంటూ ఉమా ఫైర్ అయిపోయారు. అయితే దేవినేని వాదన... ఆయనతో పాటు టీడీపీకి కూడా బూమరాంగ్ అయిపోయిందన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమా వ్యాఖ్యలపై స్పందించేందుకు మరోమారు ట్విట్టర్ లో దర్శనమిచ్చిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వరుస ట్వీట్లలో దేవినేనిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి... నేమ్ ప్లేట్ ను టీడీపీ నేతలే తయారు చేయించి, వారే రచ్చ చేస్తున్నారని సెటైర్లు సంధించారు.
సదరు ట్వీట్లలో సాయిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... 'ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా ఉమా? ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చికూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఫ్రస్టేషన్ లో మీ మాటలే కాదు చేతలూ అసహ్యం కలిగిస్తున్నాయి' అని ఓ ట్వీట్ లో పేర్కొన్న సాయిరెడ్డి... మరో ట్వీట్ లో 'జీవితాంతం వ్యవస్థల్ని మేనేజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫిర్యాదులుంటే చెప్పొచ్చు. ఇవసలు ఎన్నికలే కావనడం, పోలింగు ముగిసాక ఓటింగ్ మెషిన్లను ట్యాంపర్ చేస్తారనడం మానసిక నియంత్రణ కోల్పోయిన వ్యక్తి చేసే ఆరోపణలు' అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మొత్తంగా ఈ వ్యవహారం వైసీపీ నష్టం చేకూర్చకపోగా... రివర్స్ లో టీడీపీకే దెబ్బేసేదిగానే మారిపోయిందన్న వాాదన వినిపిస్తోంది.