విజయసాయికి మరో పదవి..

Update: 2019-07-19 07:46 GMT
విజయసాయిరెడ్డి.. వైసీపీ ఎంపీ.. జగన్ నమ్మిన బంటు.. అంతేకాదు.. వైసీపీలో ట్రబుల్ షూటర్. కష్టకాలంలో జగన్ కు వెన్నంటి ఉండి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాలనలో ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరిస్తూ ఏపీకి నిధులు, విధులు సహా అన్నింటిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయిరెడ్డి పరపతి, అధికారాలు మరింత పెరిగాయి. తాజాగా కొన్ని ఏపీ రాష్ట్ర నామినేటెడ్, వివిధ కార్పొరేషన్ సంస్థల్లో కూడా విజయసాయిరెడ్డి ఎన్నికవుతున్నారు.

ఇక బీజేపీ ప్రభుత్వం వచ్చాక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్ )లలో సభ్యులుగా పార్లమెంట్ ఎంపీలను నియమించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. గత వారం బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మరో ఎంపీ సత్యవతిలను ఏపీలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్  సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నుకుంది. దేశంలోని 9 ఎయిమ్స్ లకు ఇలాగే పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించి నియమించారు.

తాజాగా మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో  ఎయిమ్స్ ఉండడం... దాని పర్యవేక్షించేలా స్థానిక నేత అవసరం ఉండడంతో ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి ఎయిమ్స్ కు ఎన్నికయ్యారు. దీంతో ఈ వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి.

    

Tags:    

Similar News