వైసీపీకి సినీ రంగం నుంచి ఎంతో కొంత మద్దతు ఉంది అంటే అది అక్కినేని నాగార్జున వైపు నుంచే. జగన్ తో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. మంచి స్నేహం ఉంది. జగన్ జైలులో ఉన్న టైం లో కూడా వెళ్ళి చూసి వచ్చారు నాగార్జున. ఈ విషయంలో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన కామెంట్స్ కి కూడా పట్టనట్లుగా ఉండేవారు.
జగన్ సైతం నాగార్జున పట్ల అదే రకమైన అభిమానాన్ని చూపిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. వైసీపీ తరఫున ఆయన్ని ఏపీలో ఒక కీలక స్థానానికి ఎంపీగా పోటీ చేయించాలనుకుంటున్నట్లుగా ఈ మధ్యనే వార్తలు వచ్చాయి. దీని కంటే ముందు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున సమస్యల మీద చర్చించడానికి నాగార్జున చొరవ తీసుకుని ఇతర సినీ పెద్దలతో కలసి జగన్ని కలిశారు.
ఇవన్నీ కళ్ళ ముందు జరిగినవే. ఒక విధంగా నాగ్ అంటే వైసీపీ మనిషి అని అంతా భావించే సీన్ ఉంది. అయితే ఒకే ఒక్క ట్వీట్ తో వైసీపీ పెద్దాయన, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ అభిప్రాయం తప్పు అన్నట్లుగా చేశారు అంటున్నారు. దానికి కారణం ఆయన టాలీవుడ్ లో నాగ్ ని పక్కన పెట్టేసి మెగాస్టార్ చిరంజీవిని పొగడడమే. అనంతపురంలో చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు.
దాని మీద విజయసాయి ట్వీట్ చేస్తూ మెగాస్టార్ తన సినిమా ఫంక్షన్ కి ఏపీని ఎంచుకోవడం మంచి విషయం అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు అని కూడా చెప్పారు. అంతే కాదు, మెగాస్టార్ ఎంతో మందికి స్పూర్తి అని ఆయన అత్యంత ప్రతిభావంతుడని కూడా కీర్తించారు. ఆయన సినిమా గాడ్ ఫాదర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇది మెగా ఫ్యాన్స్ కి మంచి న్యూసే. వారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే టైమ్ లో నాగార్జున విషయం ఏంటి సారూ అని నెటిజన్లు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున కర్నూల్ లో తన కొత్త సినిమా ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇప్పటికే చేశారు కదా మరి ఆయన ఏపీలో సినిమా వేడుక చేసినందుకు అభినందించరా. పైగా ఆయన సినిమా కూడా దసరాకు రిలీజ్ అవుతోంది కదా ఆ మూవీ హిట్ అవాలని కోరుకోరా అంటూ నెటిజన్లు ఒక్క లెక్కన్న సాయిరెడ్డికి రీ ట్వీట్లు చేస్తున్నారు.
మరో వైపు చూస్తే నాగ్ ఫ్యాన్స్ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ మీద పూర్తిగా నిరుత్సాహానికి గురి అయ్యారని అంటున్నారు. విజయసాయిరెడ్డి కావాలని చేశారా లేక మరచిపోయారా అన్నదే ఎవరికీ అర్ధం కావడంలేదుట. నిజానికి విజయసాయిరెడ్డి కి సినిమాల మీద మంచి అవగాహనే ఉంది అంటారు. అందుకే ఆయన మెగాస్టార్ మూవీ విషయంలో చెప్పాల్సింది చెప్పారు, అదే రకమైన గ్రీటింగ్స్ నాగ్ కి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది కదా.
మరి ఎందుకు ఇలా చేశారు అన్నదే చర్చ. పైగా గాడ్ ఫాదర్ రిలీజ్ రోజే నాగ్ సినిమా వస్తోంది. ఒక సినిమా హిట్ కావాలని కోరుతూ వదిలేస్తే రెండవ సినిమా సంగతేంటి. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ట్వీట్ లో ఏదో తేడా ఉందనే అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.