పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నిక

Update: 2021-08-10 11:30 GMT
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డితోపాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది సైతం ఎన్నికయ్యారు.

ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ.. పార్లమెంట్ బులిటెన్ ను విడుదల చేశారు. ఈ కీలకమైన పదవి వైసీపీ సీనియర్ ఎంపీకి ఇవ్వడంపై ఆ పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలిస్తారు. పథకాల తీరు తెన్నులు కేటాయింపుల వివరాలను ప్రశ్నిస్తున్నారు. అవకతవకాలపై నిలదీసే హక్కును కలిగి ఉంటారు.

కొద్దిరోజులుగా కేంద్రంలోని బీజేపీతో సఖ్యతతో ఉంటున్న వైసీపీకి ఈ కీలకమైన పదవిని ఇచ్చి మోడీ పెద్దపీట వేసినట్టుగానే తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందని అనుకుంటున్న వారికి ఈ పదవి భర్తీతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టైంది.




Tags:    

Similar News