కేసీఆర్ పై పరుష పదాలతో విరుచుకుపడ్డ విజయశాంతి

Update: 2022-02-20 10:38 GMT
తెలంగాణ ఫైర్ బ్రాండ్ రామలమ్మ మరోసారి తనలోని అక్కసునంతా కక్కేశారు..  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయశాంతి పాత పరిచయాల బడబాగ్ని జ్వాలల్లో రగిలిపోయారు. ఇక కేసీఆర్ ను రెండోసారి గెలిపించినందుకు ప్రజలను తిట్టిపోశారు. రాములమ్మ ఆవేశం, ఆగ్రహం చూసి బీజేపీ నేతల చంకలు గుద్దుకోగా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం రాములమ్మ శక్తిసామర్థ్యాలను కడిగిపారేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ విజయశాంతి చెలరేగిపోయారు. తన ఉద్యమ సహచరుడైన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ వాడే భాష అసభ్యకరంగా ఉంటుందని.. భాష మార్చుకోవాలని చెబుతున్నా ఆయనలో మార్పురావడం లేదని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు.

కేసీఆర్ ను సీఎం గారూ అనే బదులు ఏరా అనాలనిపిస్తోందని.. ఆ మాటలు వింటుంటే ఆయనను తన్నాలనిపిస్తోందని విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్జిల్లా పూడురు మండలం కంకల్ గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ సెంటిమెంట్ తో ఏం మాట్లాడినా నడుస్తుందని భ్రమ పడుతున్న కేసీఆర్.. నిరంకుశ, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నిజానికి రాములమ్మకు ఇంత గుర్తింపు, విలువ, పరపతి వచ్చిందంటే కారణం.. తెలంగాణ రాష్ట్రసమితి, ఆ పార్టీ అధినేత కేసీఆరే.. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘తల్లి తెలంగాణ పార్టీ’ స్థాపించి ఎన్నికల్లో ఫ్లాప్ అయిన విజయశాంతిని అక్కున చేర్చుకొని కేసీఆర్ అందలమెక్కించారు.

తన తర్వాత టీఆర్ఎస్ లో పార్టీలో అత్యున్నత రెండోస్తానాన్ని కట్టబెట్టారు. కేసీఆర్, హరీష్ రావుల సొంత జిల్లా అయిన మెదక్ నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీ పార్లమెంట్ కు పంపారు. టీఆర్ఎస్ స్టామినా, దయతోనే విజయశాంతి గెలిచిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.

టీఆర్ఎస్ ను కాదని ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ అదే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేసి రెండు సార్లు ఓడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను వదిలేశాక గెలిచిన చరిత్ర లేదు. నిజానికి కేసీఆర్, హరీష్ లు లేకుంటే విజయశాంతి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవదు అని టీఆర్ఎస్ శ్రేణులు ఘంఠా బజాయించి చెబుతున్నారు.

అలాంటి రాములమ్మ తాజాగా బీజేపీలో చేరారు. కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే పరుష పదాలను వాడుతున్నారు.
Tags:    

Similar News