ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం చదువులంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం పై ఆడి పోసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను ట్విట్టర్ సాక్షి గా కడిగి పారేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. తాజాగా పవన్ ను టార్గెట్ చేసి సెటైర్ల వర్షం కురిపించారు..
విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.."నిత్యకళ్యాణం" గురించి సోషల్ మీడియా లో ఏమనుకుంటున్నారంటే.. సీజన్ లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమలాంటోడట’ అని పవన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి.. వేసవిలో కనిపించకుండా పోయే వాడని ఎండ గట్టాడు. ఇన్నేళ్లు ఏపీలో దోమలకు నడిచిందని.. ఇక పై దోమలకు కష్ట కాలమే అంటూ ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబు ను తన ట్వీట్ల లో వదల లేదు విజయసాయిరెడ్డి.. 'ఇసుక దీక్ష పేరిట మెడకు ఇసుక పొట్లాలను చంద్రబాబు వేసుకున్నాడని.. కరువుపైన దీక్షకు ఎముకుల హారం వేసుకుంటాడు కావచ్చు' అని బాబు పై సెటైర్లు వేశారు. చంద్రబాబు ఫస్ట్రేషన్ లో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. బాబు దొంగ దీక్షకు అసలు స్పందనే లేదని ట్వీట్ చేశారు.