బెజవాడ లో విజయసాయి రెడ్డి గృహప్రవేశం

Update: 2019-11-15 08:59 GMT
వైసీపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత విజయసాయి రెడ్డి బెడవాడ లో సెటిల్ అయి పోయారు. సీఎం జగన్ ఇప్పటి కే తాడేపల్లి లో నివాసం కట్టుకొని అక్కడి నుంచే ఏపీని పాలిస్తున్నారు. ఇప్పుడు అధినేత బాటలోనే విజయసాయి రెడ్డి కూడా నడవడం విశేషం..

శుక్రవారం విజయవాడ లో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయి రెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా ఆయన కొత్త ఇంట్లో కి షిఫ్ట్ అయ్యారు. ఇంట్లో సంప్రదాయ బద్దంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశానికి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందింది. కొంత మంది పార్టీ నాయకులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైసీపీ అధికారం లోకి రాక ముందు విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు సొంతిళ్లు ఉంది.  ఏపీలో అధికారం లోకి రావడం తో ఇప్పుడు జగన్ తర్వాత వైసీపీ లో క్రియా శీలంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కు రాక పోకలు సాగించడం కష్టం గా మారింది. రాక పోకలకు అధిక సమయం పోవడం తో ఆయన విజయవాడ లో సెటిల్ అవ్వాలని నిర్ణయించారు.  అందుకే ఏపీ ప్రజలు, నాయకులు, కార్యకర్తల కు అందుబాటు లో ఉండేందుకే  విజయవాడ లో సొంతిళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. విశాలమైన హాలు, డిజిటల్ స్క్రీన్, ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఉంది.
    

Tags:    

Similar News