కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందునా రాజకీయాలు ఒక పద్దతిలో ఉండటం సాధ్యమే కాదు. ఒకప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలుగా అందరి చేత నమస్కారాలు పెట్టించుకున్న ఆమె.. తర్వాతి కాలంలో కేసీఆర్ కు కటీఫ్ చెప్పి కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత అడపాదడపా కేసీఆర్ మీద విమర్శలు చేయటమే కాదు.. తీవ్ర విమర్శలు చేసింది లేదు. ఈ లోటును భర్తీ చేసేలా తాజాగా ఆమె ట్వీట్లు ఉన్నాయి. మీడియా మొదలుకొని విపక్ష నేతల వరకూ ఎవరూ కూడా కేసీఆర్ మీద విమర్శలు.. ఆరోపణలు చేయటానికి సాహసించని పరిస్థితి.
ఇలాంటివేళ.. కేసీఆర్ మీద భారీ కుంభకోణం ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు రాములమ్మ అలియాస్ విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేసీఆర్ సర్కారు తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ ను ఆమె టార్గెట్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఒక మూవీని ప్లాన్ చేయటం.. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించటం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు.. అన్ని వుడ్ లు ఒక్కసారి జక్కన్న ప్లాన్ చేసిన ఆర్ ఆర్ ఆర్ వైపు ఒక లుక్ వేశాలా ఆయన సినిమాను ప్లాన్ చేశారని చెప్పాలి.
అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ మూవీ టైటిల్ తనదైన శైలిలో సరికొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు విజయశాంతి. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్(రాజమౌళి రామారావు రామ్ చరణ్) అర్థం ఉండగా.. రాములమ్మ ఆర్ ఆర్ ఆర్ కు రీజనల్ రింగ్ రోడ్డుగా కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆమె సంచలన ట్వీట్లు చేశారు. వాటిని ఏ మాత్రం మార్చకుండా.. చెప్పుకొస్తే..
+ "రాజమౌళి దర్శకత్వం వహించే RRR చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త RRR ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి RRR ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్.
+ ఈ RRR కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది.
+ కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే... తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి - మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి.
+ దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
+ కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ... ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం"