రూ.30 కోట్లు!... ఎక్క‌డైనా గోపీల రేటు ఇదే!

Update: 2019-03-31 14:21 GMT
ప్ర‌స్తుత రాజ‌కీయాలంతా జంపింగ్ జ‌పాంగ్‌ ల‌దే. ఎన్నిక‌ల్లో ఓ పార్టీ టికెట్ పై పోటీ చేసిన గెలిచిన నేత‌... ఆ పార్టీ అధికారంలోకి రాక‌పోతే... తాను ఓడించిన అభ్య‌ర్థికి చెందిన పార్టీలోకి చేరిపోయేందుకు ఆస‌క్తి చూపుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇందులో ఆయా నేత‌లు అవ‌స‌రాలు ఒక కార‌ణ‌మైతే... అధికార పార్టీల బెదిరింపులు, అదిలింపులు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లు కూడా ఓ కార‌ణంగానే చెప్పాలి. ఇలా ఓ పార్టీ త‌ర‌ఫున ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎంపికూ ఇంకో పార్టీలోకి చేరిపోయే నేత‌ల స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాలని పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం చెబుతున్నా... ఆ చ‌ట్టం అమ‌లు అవుతున్న దాఖ‌లా మాత్రం క‌నిపించ‌డం లేదు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో మొద‌లైన ఈ కొత్త సంస్కృతి ఆ త‌ర్వాత ఏపీలోనూ జోరుగా సాగింది. వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ముగ్గురు ఎంపీల‌తో పాటు 23 మంది ఎమ్మెల్యేలు, ఓ ముగ్గురు ఎమ్మెల్సీల‌ను కూడా అధికార టీడీపీ లాగేసింది. అయితే ఈ తంతు క‌ళ్లెదుటే జ‌రుగుతున్నా కూడా ఎద‌ర్కొనేందుకు అవ‌కాశం లేక విప‌క్ష వైసీపీ సైలెంట్‌ గానే ఉండిపోయింది. ఇక తెలంగాణలో అయితే ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇంకా కొన‌సాగుతూనే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే ఏపీలోలో ఈ ఫిరాయింపుల సందర్భంగా జ‌నం ముందుకే వ‌చ్చిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... త‌న ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీ సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్లుగా కొనేస్తోందంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఒక్కో ఎమ్మెల్యే కోసం టీడీపీ ఏకంగా రూ.30 కోట్ల‌ను వెచ్చిస్తోంద‌ని, దానితో పాటు ప‌లు కాంట్రాక్టులు కూడా అప్ప‌గిస్తోంద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా కొత్త వాద‌న‌తో జంపింగ్ ల రేటు ఎంతో జ‌గ‌న్ చెప్పేశారు. అయితే ఆ జంపింగ్‌ లంద‌రికీ చంద్ర‌బాబు షాకివ్వ‌గా.. ఇప్పుడు వారంతా తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నార‌నుకోండి... అది వేరే విష‌యం. మొత్తంగా ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ఫిక్స్ అయిన రేటుగా జ‌గ‌న్‌... రూ.30 కోట్ల‌ను పేర్కొన్నారు. ఇలా ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి మారిపోయే గోడ మీద పిల్లు(గోపి)ల మాదిరి నేత‌ల రేటు ఎక్క‌డైనా ఒక‌టేన‌ని ఇప్పుడు తేలిపోయింది. ఏపీలోనే కాకుండా తెలంగాణ‌లోనే గోపీల రేటు రూ.30 కోట్లేన‌ని ఇప్పుడు తేలిపోయింది. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ప్రచార కమిటీ అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ విజయశాంతి నిర్దారించేశారు.

2014 ఎన్నిక‌ల త‌ర్వాతే కాకుండా మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కూడా తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే క‌దా. దీనిపై నోరు విప్పిన విజ‌య‌శాంతి త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రూ.30 కోట్లు ఇస్తేనే టీఆర్ ఎస్ లోకి వెళుతున్నారని, అలాంటి వారిని తాము ఆపలేకపోతున్నామనడం సరికాదని ఆమె వాపోయారు. కాంగ్రెస్ ను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, అలాంటి నాయకులు డబ్బుకు దాసోహం అంటూ పార్టీ మారుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. పార్టీ మారుతూ నాయకత్వం సరిగా లేదంటూ అపవాదు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లందరూ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నాయకత్వం బాగుందో? లేదో? గుర్తించలేదా అంటూ నిలదీశారు. మొత్తంగా ఈ వ్యాఖ్య‌ల‌తో గోపీల రేటు ఏపీతో పాటుగా తెలంగాణ‌లోనూ ఒక‌టేన‌ని, ఆ రేటు రూ.30 కోట్లేన‌ని విజ‌య‌శాంతి తేల్చి చెప్పిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.


Tags:    

Similar News