మాజీ సినీనటి - కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన విజయశాంతి తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని వివరించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్ తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమని అని ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో యువతకు అవకాశాలు ఈ సారీ ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నానని విజయశాంతి తెలిపారు. రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన చేయడానికి సిద్ధమన్నారు.
రాములమ్మగా ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమని విజయశాంతి ప్రకటించారు. ఇక నుంచి చురుకైన పాలిటిక్స్ లో విజయశాంతిని చూస్తారని ప్రకటించారు. `నాకున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. మీడియాకున్న ఫ్రీడమ్ కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ప్రజల సమస్యల ను చూపించకుండా మీడియా గొంతు కూడా ఈ ప్రభుత్వం నొక్కుతోంది. 20 ఏళ్ల నుండి తెలంగాణ కోసం పోరాడుతున్నాను,ఇక ముందూ పోరాడుతాను. కోదండరాంకు ప్రజలలో తిరిగే హక్కు ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒకవేళ ప్రజలు గళం విప్పితే ప్రజలను కూడా జైల్లో పెడుతుందా ఈ ప్రభుత్వం?` అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.
అవసరం కోసం పవన్ కొత్త రాజకీయాలు చేస్తుండొచ్చనని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళని...పవన్ మాటలకు ఏమీ పడరని ఆమె వ్యాఖ్యానించారు. `అన్నను చూసాం అన్నకు దిక్కులేదు,ఇప్పుడు తమ్ముడి పవన్ ని చూస్తున్నాం. రెండుపడవల ప్రయాణం పనికిరాదు - ఒకవైపు దృష్టి పెడితే బాగుంటుంది.` అని అన్నారు. ఉద్యమంలో సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన వాళ్లను మంత్రులుగా తీసుకునే ముందు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందని అన్నారు. `తెలంగాణ విడిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయి. ఈ ప్రభుత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తుంది - కళ్ళు నేల మీద ఉంటే మంచిది. ఇది బంగారు తెలంగాణగా కనబడటం లేదు. ఇత్తడి తెలంగాణగా కనపడుతోంది. ఉద్యమంలోని కేసీఆర్ వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఉన్న కేసీఆర్ వేరు` అని అన్నారు.
రాజకీయాలలో అన్నీ చూశానని విజయశాంతి వివరించారు. `ఒడిదుడుకులు - వెన్నుపోట్లు - అవమానాలు - అన్నీ ఫేస్ చేసాను. తెలంగాణ కోసం ఇద్దరు వేరు వేరుగా పోరాడటం దేనికి? కలిసి పోరాడండి అని జయశంకర్ పిలుపు మేరకు నా పార్టీని టీఆర్ ఎస్ లో విలీనం చేశాను. కానీ నన్ను టీఆర్ ఎస్ పార్టీ నుండి అర్ధరాత్రి సస్పెండ్ చేశారు. నన్ను పార్టీనుండి ఎందుకు సస్పెండ్ చేసారో ఇప్పటికీ తెలియదు. ప్రజలు గమనిస్తున్నారు` అని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి గురించి స్పందిస్తూ... `జయలలిత అంటే అభిమానం - అందుకే ఏఐఏడీఎంకేకి సపోర్ట్ చేశాను. అయితే డీఎంకే పార్టీ నన్ను చంపాలని చూసింది.` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో తన ప్రస్థానం గురించి విజయశాంతి వివరించారు. `మేమందరం అద్వానీ శిష్యులం. అద్వాణీకి బీజేపీలో అన్యాయం జరిగింది. కనీసం అధ్యక్షుడిగా అయినా ఎన్నుకోవాల్సింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అమాయకుడు. అందుకే వెన్నుపోటు. అలా టీఆరెస్ పార్టీలో జరగదు` అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.