కొందరి మాటలు చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి.. సమయానికి తగ్గట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ను విమర్శించే సాహసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేయని వేళ.. అందుకు భిన్నంగా విజయశాంతి మాత్రం సోషల్ మీడియాను అసరా చేసుకొని చెలరేగిపోతున్నారు.
సుత్తి లేకుండా సూటిగా విమర్శల్ని సంధిస్తున్న ఆమె తీరు ఇప్పుడు చర్చగా మారింది. నోటికి వచ్చినట్లు కాకకుండా ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తూ.. కేసీఆర్ ఇరుకున పడేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 69 రోజులకు మంత్రివర్గాన్ని విస్తరించటం.. అందులో హరీశ్‌కు చోటు దక్కకపోవటంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
టీఆర్ ఎస్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వారెవరైనా సరే.. కేసీఆర్ దెబ్బకు ఔట్ కావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆలె నరేంద్ర.. నిన్న నేను.. నేడు తన్నీరు హరీశ్ రావు అంటూ విజయశాంతి చెప్పిన ఉదాహరణకు ఇప్పుడు అందరూ కనెక్ట్ అయ్యే పరిస్థితి. దొరల వారసత్వ పాలన తీరు నాడు.. నేడు.. రేపు.. ఎప్పుడైనా ఇంతేనని తేల్చేశారు.
నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయటం టీఆర్ఎస్ నాయకత్వ నైజమన్న విషయం మరోసారి రుజువైందన్నారు. కాలం మారినా టీఆర్ ఎస్ నాయకత్వ వైఖరి మారలేదన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలుగా విజయశాంతి కొద్ది కాలం చెలామణి కావటం తెలిసిందే. అనంతరం ఆమె టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి సమయం చూసుకొని తన పోస్టులతో షాకుల మీద షాకులు ఇస్తున్నారు.