సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. అవసరమైతే కేసీఆర్ యూపీఏలో చేరతారన్న వ్యాఖ్యల్ని ఆమె తప్పు పట్టారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్లు పోరాడుతోందని.. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అనవసర కన్ఫ్యూజన్ కు గురి చేస్తాయన్నారు.
జగ్గారెడ్డి మాటలతో కాంగ్రెస్ కంటే టీఆర్ ఎస్ కు ఓటు వేయటం మేలని ప్రజలు భావించే వీలుందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన విజయశాంతి.. జగ్గారెడ్డి మాటలతో లేనిపోని సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తుందన్నారు. జగ్గారెడ్డి మాటలు.. కాంగ్రెస్.. టీఆర్ ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ఉందని చెప్పారు. జగ్గారెడ్డి మాటల్ని పూర్తిగా ఖండించిన విజయశాంతి తీరు కాస్త కొత్తగానే ఉందని చెప్పాలి.
కేంద్రంలో టీఆర్ ఎస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్న కేసీఆర్ వాదనను జగ్గారెడ్డి నమ్ముతున్నట్లుగా అనుమానాన్ని ఆమె వ్యక్తం చేయటం గమనార్హం. ఇటీవల కాలంలో గులాబీ కారు ఎక్కేనేతల పేర్లలో జగ్గారెడ్డి పేరు బలంగా వినిపించటం తెలిసిందే. టీఆర్ ఎస్ లో చేరతానంటూ వస్తున్న వాదనను జగ్గారెడ్డి ఖండించినా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ బాస్ కు మేలు చేసేలా ఉన్నాయని చెబుతున్నారు.
ఇలాంటివేళ.. జగ్గారెడ్డి మాటల్ని పూర్తిగా కొట్టేస్తూ విజయశాంతి మాటలు ఆసక్తికరంగా మారినట్లు చెప్పాలి. అనవసరమైన కన్ప్యూజన్ ను కొట్టిపారేస్తూ.. టీఆర్ ఎస్ అవసరం తమకు ఉండదన్నట్లుగా విజయశాంతి మాటలు ఆమె సొంతమా? లేక పై నుంచి వచ్చిన సంకేతాలకు తగ్గట్లు మాట్లాడుతున్నారా? అన్నది తేలాల్సి ఉంది. తన మాటల్ని కొట్టిపారేస్తూ విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందన ఏమిటన్నది చూడాలి.