తెలంగాణ ఫైర్ బ్రాండ్ రామలమ్మ మరోసారి తనలోని అక్కసునంతా కక్కేశారు.. ‘ఛీ.. కేసీఆర్ తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయశాంతి పాత పరిచయాల బడబాగ్ని జ్వాలల్లో రగిలిపోయారు. ఇక కేసీఆర్ ను రెండోసారి గెలిపించినందుకు ప్రజలను తిట్టిపోశారు. రాములమ్మ ఆవేశం, ఆగ్రహం చూసి బీజేపీ నేతల చంకలు గుద్దుకోగా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం రాములమ్మ శక్తిసామర్థ్యాలను కడిగిపారేస్తున్నారు.
ఇంతకీ విజయశాంతి ఏమందంటే.. ‘కేసీఆర్ తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని’ వాపోయింది. టీఆర్ఎస్ కు రెండోసారి అధికారం ఇచ్చి ప్రజలు తప్పు చేశారని ఆడిపోసుకుంది. ఇంకా పదేళ్లు ఆయన సీఎంగా ఉంటే తెలంగాణ ఏమైపోతుందోనని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక కొన్ని దోపిడీ డైలాగులు కూడా రాములమ్మ చెప్పుకొచ్చింది. అధికారం ఉందని కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
నిజానికి రాములమ్మకు ఇంత గుర్తింపు, విలువ, పరపతి వచ్చిందంటే కారణం.. తెలంగాణ రాష్ట్రసమితి, ఆ పార్టీ అధినేత కేసీఆరే.. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘తల్లి తెలంగాణ పార్టీ’ స్థాపించి ఎన్నికల్లో ఫ్లాప్ అయిన విజయశాంతిని అక్కున చేర్చుకొని కేసీఆర్ అందలమెక్కించారు. తన తర్వాత టీఆర్ఎస్ లో పార్టీలో అత్యున్నత రెండోస్తానాన్ని కట్టబెట్టారు. కేసీఆర్, హరీష్ రావుల సొంత జిల్లా అయిన మెదక్ నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీ పార్లమెంట్ కు పంపారు. టీఆర్ఎస్ స్టామినా, దయతోనే విజయశాంతి గెలిచిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.
టీఆర్ఎస్ ను కాదని ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ అదే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీచేసి రెండు సార్లు ఓడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను వదిలేశాక గెలిచిన చరిత్ర లేదు. నిజానికి కేసీఆర్, హరీష్ లు లేకుంటే విజయశాంతి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవదు అని టీఆర్ఎస్ శ్రేణులు ఘంఠా బజాయించి చెబుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దుబ్బాక పోటీచేయమని రాములమ్మను కాంగ్రెస్ పార్టీ కోరిందట.. కానీ ఆమె పోటీచేస్తే గెలవదని.. తాము సహకరించమని దుబ్బాక కార్యకర్తలు, నేతలే కాంగ్రెస్ అధిష్టానం ముఖం మీదే చెప్పేశారట.. అందుకే టీఆర్ఎస్ నుంచి నేతను అరువు తీసుకొచ్చిన పోటీచేయించారు. మెదక్ నుంచి గెలిచిన విజయశాంతి దుబ్బాకలో కాంగ్రెస్ తరుఫున గెలవదనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.ఆమె ప్రజల్లో ఉండకపోవడం.. ప్రజలకు దూరంగా ఉండి సోషల్ మీడియాలో అప్పుడో ఇప్పుడో మెరవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
అలాంటి రాములమ్మ ఈరోజు తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏ ప్రజాప్రతినిధికైనా కానీ గెలిపే అంతిమంగా రాజకీయాల్లో విజయం.. ఆ గెలుపు లేనిదే ఎవ్వరూ పట్టించుకోరు. టీఆర్ఎస్ ను వీడాక ఒక్కసారి కూడా గెలవలేకపోయిన విజయశాంతి మాటలను అందుకే టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదని ఇన్ సైడ్ టాక్. మొదట తాను నిరూపించుకొని ఆ తర్వాత ఎన్ని మాటలైనా అంటే దానికి అర్థం పరమార్తం ఉంటుందని గులాబీ శ్రేణులు రాములమ్మకు హితవు పలుకుతున్నారు..