ఎన్‌ కౌంట‌ర్‌ పై ర‌గిలిన రాముల‌మ్మ

Update: 2015-09-16 16:52 GMT
టాలీవుడ్ లేడీ అమితాబ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ చెల్లి విజ‌య‌శాంతి చాలా రోజుల త‌ర్వాత త‌న గ‌ళం వినిపించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటున్న ఆమె ఎట్ట‌కేల‌కు త‌న మౌనం వీడి మాట్లాడారు. వ‌రంగ‌ల్ జిల్లాలో జ‌రిగిన ఎన్‌ కౌంట‌ర్‌ పై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మావోయిస్టుల ఎజెండానే త‌మ ఎజెండా అన్న తెరాస ప్ర‌భుత్వం భూట‌క‌పు ఎన్‌ కౌంట‌ర్ ల‌కు తెర‌లేపుతోంద‌ని ఆమె విమ‌ర్శించారు.

   తెలంగాణ‌లో రాజ్యం మారింది..కానీ రాజ్య‌హింస మాత్రం ఆగ‌లేద‌ని త‌న‌దైన సినీ స్టైల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. తెరాస ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌పై మౌనంగా ఉన్న ఆమె చాలా రోజుల త‌ర్వాత ఎన్‌ కౌంట‌ర్‌ పై ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌డుతూ విమ‌ర్శ‌లు చేయ‌డం విశేషం. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న ఆమెకు ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ మెద‌క్ ఎంపీ స్థానం కేటాయించేందుకు నిరాక‌రించారు.

 త‌ర్వాత కేసీఆర్‌ తో విబేధించి కాంగ్రెస్‌ లో చేరిన ఆమె మెద‌క్ ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల తెరాస‌లో చేరేందుకు ఆమె మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా ప్ర‌య‌త్నాలు చేసినా కేసీఆర్ నో చెప్పార‌ని స‌మాచారం. అందుకే విజ‌య‌శాంతి కేసీఆర్‌ ను టార్గెట్‌ గా చేసుకుని మ‌ళ్లీ విమ‌ర్శ‌లు స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక నుంచి విజ‌య‌శాంతి త‌న పాత పంథాలో కేసీఆర్ అండ్ కోపై విమ‌ర్శ‌లు గుప్పిస్తారా లేదా అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News