విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఫోటోల రగడ ఇప్పుడు అక్కడ హాట్ హాట్ గా మారింది. మేయర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా మారిన ప్రభుత్వానికి తగ్గట్లు ఫోటోల్లో చోటు చేసుకున్న మార్పును ఆయన తప్పు పట్టటం ఆశ్చర్యకరంగా మారింది. మారిన ప్రభుత్వానికి తగ్గట్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలంని మార్చటం తెలిసిందే. అయితే.. కింది స్థాయి అధికారుల అనాలోచిత చర్యలు ఒక ఎత్తు అయితే.. అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన విజయవాడ మేయర్ తీరును తప్పుపడుతున్నారు.
నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో దివంగత ఎన్టీఆర్.. చంద్రబాబు ఫోటోలు ఉండేవి. తాజాగా వాటి స్థానంలో జగన్ ఫోటోను ఏర్పాటు చేశారు.దీంతో కార్పొరేషన్ అధికారులపై మేయర్ మండిపడ్డారు. తాను చెప్పిందే చేయాలని.. వైఎస్ జగన్ ఫోటో పెట్టటం సరికాదన్నారు. ఎన్టీఆర్ ఫోటోను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే సభలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టటం కౌన్సిల్ హాల్లో పెట్టటం సంప్రదాయమని.. ఎన్టీఆర్ ఫోటోతో పాటు వైఎస్ ఫోటోను కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాధినేతగా..జగన్ ఫోటో పెట్టకూడదనటానికి మేయర్ కు అవకాశం ఉండదంటున్నారు. అదే సమయంలో మరణించిన ముఖ్యమంత్రుల ఫోటోల్ని ఏర్పాటు చేయటంలో ఎలాంటి తప్పు లేదని.. ఆ విషయంలోనూ మేయర్ తీరు సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. అవసరానికి మించిన అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న మేయర్ తన ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.