తాగి నడిపే బండి నడిపేవారికి ఇక చుక్కలే ,రక్త పరీక్ష చేస్తారట!

Update: 2020-11-29 00:30 GMT
డ్రంకన్ డ్రైవ్ .. పీకలదాకా తాగడం , ఆ తర్వాత మద్యం మత్తులో వాహనాన్ని తీసుకోని రోడ్డెక్కడం , అమాయకుల ప్రాణాలని పొట్టన పెట్టుకోవడం .. మందుబాబుల వ్యవహారశైలి ఇదే. పోలీసులు , ప్రభుత్వాలు ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే మద్యం తాగిన వ్యక్తులు రోడ్డు యాక్సిడెంట్లు చేయడం కూడా బాగా పెరిగిపోయాయి. దీనితో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మద్యం తాగి వాహనాలు నడిపే వారి తాట తీసేవారు. కానీ,కరోనా వైరస్ విజృంభణ తర్వాత డ్రంకన్ డ్రైవ్ టెస్టులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో మందుబాబులు రెచ్చిపోతున్నాయి.

మందుబాబులు ఇష్టారాజ్యంగా పీకలదాకా తాగి, బండ్లు, కార్లతో రోడ్లెక్కుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మద్యే హైదారాబాద్‌ లో ఇటువంటి ఘటనలు రెండు జరిగాయి.ప్రస్తుత పరిస్థితులను వాడుకుని తప్పించుకు తిరుగుతోన్న మందుబాబులు చాలామందే ఉన్నారు. తాగి కొందరు రోడ్లపై డ్రైవింగ్ చేస్తోన్న తీరుపై ప్రజలు కూడా చాలా సీరియస్‌ గా ఉన్నారు. వారు పోయేదే కాకా , మరొకరి ప్రాణాలని కూడా తీసుకుపోతున్నారు. ఈ తరుణంలో విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ ఆకతాయలకు, మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. రక్త పరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతం తెలుసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

సాధరణంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించే బ్రీత్ ఎనలైజర్ పరికరంలో నోటితో ఊదాల్సి ఉంటుందని, అయితే , నోటి తుంపరుల వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశముందని చెప్పారు. కరోనా మహమ్మారి జాగ్రత్తల్లో భాగంగానే తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. అందుకే రక్త పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News