అయోధ్య రామాలయం విరాళాల వివాదం తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య చిచ్చు పెడుతోంది. ఎమ్మెల్యే చల్లారెడ్డి వ్యాఖ్యలతో రేగిన వివాదం వరంగల్ నగరంలో దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లింది. వరంగల్ లో ఉద్రిక్తతలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.
తాజాగా రాములమ్మ తెలంగాణ ప్రభుత్వం తీరు ఏకపక్షంగా ఉందని తీవ్రంగా ఖండించారు. వరంగల్ లో దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ నేతలను వదిలి పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధించడం ఏంటని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమని విజయశాంతి తప్పుపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తెగిస్తే జైళ్లు చాలవని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయశాంతి హెచ్చరించారు.
ఈ ఘటన విషయంలో వరంగల్ వెళ్లి తాము నిరసన తెలుపడానికి కూడా సిద్ధమని విజయశాంతి తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ తీరు మార్చుకోకుంటే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు.