ట్విట్టర్ సాక్షిగా జొమాటోపై యుద్ధం..! గెలుపెవరిదంటే..?

Update: 2021-10-20 16:30 GMT
ఆహార పదార్థాలు అనుకున్న సమయానికి.. కావాల్సిన చోటుకు తెప్పించి కస్టమర్ల ప్రశంసలు పొందుతో జోమాటో సంస్థ. దేశంలో ఫుడ్ డెలివరీలో నెంబర్ వన్ సంస్థగా కొనసాగులూ ఎప్పటికప్పుడు కస్టమర్లను వివిధ ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. ఆన్లైన్లోనే బిజినెస్ మొదలు పెట్టిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి తారా స్థాయికి ఎదిగింది. అయితే జొమాటో లో పనిచేసే కొందరు ఎగ్గిక్యూటివ్స్ ప్రవర్తనతో అప్పుడప్పుడూ కంపెనీ క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తోంది. లాక్డౌన్ సమయంలోనూ ప్రాణాలకు తెగించి సర్వీసు చేసిన ఈ సంస్థ ఇటీవల ఓ విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏకంగా ఈ సంస్థ వ్యవస్థాపకుడినే రంగంలోకి దింపిన ఆ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భాషాభిమానం మిగతా రాష్ట్రాల కంటే తమిళుల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రతీదీ తమ సొంత లాంగ్వేజ్లోనే ఉండేలా ఇక్కడివారు భాషను అభివృద్ధి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే భాషాభిమానం జొమాటో కంపెనీ వ్యవస్థాపకుడి చేత క్షమాపణలు తెప్పించింది. హిందీ భాష నేర్చుకోవాలని ఓ కస్టమర్ పై జొమాటో ఎగ్గిక్యూటివ్ దురుసుగా ప్రవర్తించడంతో ఆ కస్టమర్ తనకు జరిగిన అవమానాన్ని తన రాష్ట్ర ప్రజలతో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ వివాదం రాష్ట్రవ్యాప్తమయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తమిళనాడు రాష్ట్రంలోని వికాస్ అనే కస్టమర్ ఫుడ్ ఆర్డర్ కోసం జొమాటోను సంప్రదించాడు. తనకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించాలని జొమాటోకు ఆర్డర్ పెట్టాడు. అయితే తనకు రావాల్సిన ఓ ఐటమ్ మిస్సయింది. దీంతో తనకు కావాల్సిన ఐటమ్ రాలేదని వికాస్ జొమాటో కస్టమర్ సర్వీస్ ను సంప్రదించాడు. కొంత సేపు కస్టమర్ సర్వీస్ తో వాట్సాప్లో చాట్ చేశాడు. అయితే తనకు కావాల్సిన ఐటమ్ రిఫండ్ చేయలేదు. దీంతో వికాస్ తనకు హిందీ రాదనే నెపంతో ఆ ఐటమ్ మళ్లీ పంపించలేదని వికాస్ ఆరోపించాడు.

అంతేకాకుండా కస్టమర్ సర్వీస్ తో తాను చాట్ చేసిన స్క్రీన్ షాట్లన్నింటినీ ట్విట్టర్లో పెట్టి #Reject Zomato అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. అంతేకాకుండా డీఎంకే నాయకురాలు కనిమొళి కూడా స్పందించారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తం కావడంతో జొమాటోనే రిజెక్ట్ చేయాలని అందరూ డిమాండ్ చేశారు. రాను రాను వివాదం మరింత తీవ్రం కావడంతో జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్పందించాల్సి వచ్చింది.

వెంటనే ఆయన రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పారు. కస్టమర్ వికాస్ తో పాటు తమిళ ప్రజలకు తాను క్షమాపణలు చెబుతున్నానను అంటూ ‘వణక్కం’ అని మెసెజ్ పెట్టాడు. అయితే వెంటనే కస్టమర్ ఎగ్గక్యూటివ్ ను విధుల్లో నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని గంటల్లోనే ఆయనను తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లయింది. ఈ సందర్భంగా జొమాటో వ్యవస్థాపకుడు మాట్లాడారు. తన ప్రసంగాన్నంతా ట్విట్టర్లో మెసెజ్ పెట్టాడు. ఆయన పెట్టిన మెసేజ్ కు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

‘మనమంతా భారతీయులం. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తెలియక చేసిన తప్పును జాతీయ సమస్యగా చిత్రించడం బాధగా ఉంది. ఆయా ప్రాంతాల వారు భాషలు నేర్చుకోవడానికి సమయం పట్టొచ్చు. అంతేందుకు నాకు కూడా కొన్ని ప్రాంతాల భాషలు రావు. మనమందరం ఒకరి లోపాలు ఒకరు సహించుకోవాలి. అంతేకాకుండా సర్దుకుపోవాలి’ అని గోయల్ ట్విట్ చేశాడు. జోమాటో ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఇరువైపులా కామెంట్లు పెడుతున్నారు. కాగా జొమాటో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కామన్ అయిపోయింది.




Tags:    

Similar News