బ్రేకింగ్: చంద్రుడిపై కూలిన విక్రమ్.. నాసా ప్రకటన

Update: 2019-09-27 06:28 GMT
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రుడి ఉపరితలంపై దించిన విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిపోయిందని నాసా ప్రకటించింది. చంద్రయాన్2 ప్రయోగం విఫలమైందని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నాసా తీసిన ఫొటోలను విడుదలచేసింది.

నాసా ఈ మేరకు ఫొటోలను విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో దించిన విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సబంధాలు కోల్పోయిన విక్రమ్ తో అనుసంధానానికి ఇస్రో చాలా ప్రయత్నాలు చేసినా కనెక్టివిటీ లభించలేదు. ఇక ఇస్రో పంపిన ఆర్బిటర్ కూడా విక్రమ్ జాడను కనిపెట్టలేదు.

అయితే నాసా ఉపగ్రహం తాజాగా ఇస్రో దించిన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాలను ఫొటో తీసింది. అందులో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ తో కూలిందని నాసా ప్రకటించింది.

చంద్రయాన్ 2 నుంచి విక్రమ్ ల్యాండర్ ను ఇస్రో చంద్రుడి ఉపరితలంపై దించే ప్రయోగంలో 2.1 కి.మీల ఎత్తులో ఇస్రోతో విక్రమ్ 2 ల్యాండర్ కు కనెక్టివిటీ తెగిపోయింది. విక్రమ్ సేఫ్ గా దిగిందా కూలిందా అన్నది తెలియరాలేదు. దీంతో ఇస్రో కు నాసా సాయం చేయడానికి ముందుకువచ్చింది. చాలా రోజులుగా వెతికిన నాసా తాజాగా ఇస్రో దించిన విక్రమ్ ల్యాండర్ ప్రదేశపు చాయచిత్రాలను తీసింది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్టు ప్రకటించింది. అయితే విక్రమ్ జాడను మాత్రం ఖచ్చితంగా గుర్తించలేకపోయామని తెలిపింది.
Tags:    

Similar News