వికారుద్దీన్ పేరు వినగానే పోలీసులకు సైతం కూసింత ఆందోళన. పక్కా ప్లానింగ్‌తో పోలీసుల మీదనే దాడి చేయటం ఇతగాడి ప్రత్యేకత. ఐఎస్‌ఐ ఉగ్రవాదిగా పేరుమోసిన ఇతగాడు పోలీసుల్ని తరచూ టార్గెట్ చేసుకొనేవాడు. ఐదేళ్లు దాడు చేసి దొరక్కుండా తప్పించుకుపోయేవాడు.
2008 డిసెంబరు మూడో తేదీన.. 2009 మే 18న.. 2010 మే 14న కాల్పులు జరిపిన ఇతగాడు.. తాను పోలీసుల్ని టార్గెట్ చేసిన ప్రతిసారీ ఒకరిద్దరిని చంపేసేవాడు. చివరకు పోలీసులకు చిక్కిన ఇతగాడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. జైల్లో కూడా ఇతగాడి దెబ్బకు తట్టుకోలేక వరంగ్ జిల్లా జైలుకు తరలించారు. ఆర్నెల్ల క్రితమే ఇతడ్ని వరంగల్‌కు తరలించారు.
చర్లపల్లి నుంచి వరంగల్ జైలుకు తరలించిన తర్వాత కూడా వికారుద్దీన్ ఆగడాలు తగ్గలేదు. నిత్యం పోలీసుల్ని బెదిరించటం.. వారి అంతు చేస్తామని వ్యక్తిగతంగా మాట్లాడటం లాంటివి వికారుద్దీన్ చేసేవాడు. ఈ విషయాన్ని జైలుసిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆరా తీసిన పోలీసులు ఇతనిపై మరో కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇతగాడి బుద్ధి ఏమాత్రం మారని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. వరంగల్ నుంచి హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా.. తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల చేతిలో హతమయ్యాడు. దీంతో ఆరాచకవాది వికారుద్దీన్ కథ ముగిసింది.