ఆనందయ్య నాటు మందు పై రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. పది రోజుల క్రితం వరకు ఆనందయ్య మందును అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై ప్రస్తుతం సీసీఆర్ ఏఎస్ పరిశోధనలు చేస్తుంది. మందుపై అధికారిక అధ్యయనం జరుగుతుండటం, కృష్ణపట్నంకు వేలాది మంది వస్తుండటంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. అయితే , ఆ తర్వాత ఆనందయ్య ను సీక్రెట్ ప్లేస్ కి తరలించారు. దీనితో ఆనందయ్య ఎక్కడున్నారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగనే ఉందా, ఎప్పుడు మందులు తయారు చేస్తూ బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఆయనను ఎవరికీ ఎందుకు చూపించడం లేదని , ఆయన ఆచూకీ చెప్పానలి, ఆనందయ్యను వదిలిపెట్టాలని కృష్ణపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకి లేదని గ్రామస్తులు ఆంధోళన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఉన్నారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణపట్నం పరిశరాల్లో చాలా చోట్ల కరోనా కేసులు లేవని, దానికి కారణం ఆయన ఇస్తున్న మందే అంటున్నారు. వారం రోజలు దాటిన ఆయన మందుపై ఎందుకు నివేదిక ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే .. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు. దేశ వ్యాప్తంగా అందరూ ఈ మందు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆనందయ్యకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు మందు వాడుతున్నవారు అంతా తమకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పడం, కరోనా నుంచి కోలుకున్నామని కొందరు చెబుతుండడంతో డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఆయన ఔషదంతో ఎలాంటి హామీ లేదని ఆయూష్ అధికారులు నిర్ధారించడంతో ఆనందయ్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.ఇదిలా ఉండగానే.. శుక్రవారం నుంచి మందు పంపిణీ ప్రారంభిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. ప్రస్తుతం ఆయుర్వేద మందును పంపిణీ చేయడం లేదని, ప్రభుత్వం ప్రస్తుతం మందు పంపిణీని నిలిపేసిందన్నారు. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని, ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత, మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.
ఆనందయ్య మందుపై మరో రెండురోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు టీటీడీ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పటికే ఆనందయ్య కుటుంబంతో మాట్లామన్న చెవిరెడ్డి, మందుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఔషధం పట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తే మందు తయారీ, పంపిణీకి ముద్ధ ప్రతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైపు ఆనందయ్య పై తీవ్ర ఒత్తిడి ఉందని, ఆయనతో కొందరు ప్రైవేటుగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. విపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా, ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని, 30 ఏళ్లుగా తాను మందు పంపిణీ చేస్తున్నానని, కానీ ఇప్పుడు ఫార్ములా ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వం ఒత్తిడి లేకుండా చూడాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది.