తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. టీఆర్ఎస్ సీనియర్ నేత క్లారిటీ

Update: 2022-11-26 13:40 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమా? ఈసారి ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు జరుగనున్నాయా? ఈ మేరకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసిందా? అంటే ఔననే అంటున్నాయి గులాబీ వర్గాలు. ఈ మేరకు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ టీఆర్ఎస్ నేత ఈ విషయాన్ని బయటపెట్టాడు. తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

తెలంగాణలో ఇంకో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయంటూ వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని అందరూ అనుకుంటున్నారని.. కానీ తన దృష్టిలో రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే గ్రామాల్లో రాజకీయ వేడి పుడుతుందని వ్యాక్యానించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరోక్షంగా ముందస్తు ఎన్నికలపై స్పందించారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటూ అనేకసార్లు సీఎం కేసీఆర్ బహిరంగంగా క్లారిటీఇచ్చారు. కానీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.

ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం చేయడం.. నేతలు నియోజకవర్గాల్లో ఉండి ప్రజల్లో తిరగాలని కేసీఆర్ సూచించడంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తామంటూ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతోపాటు నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను నియమించనున్నట్లు ప్రకటించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News