వైరల్‌ : గంగూలీని ట్రోల్‌ చేసిన సొంత కూతురు

Update: 2019-11-26 12:38 GMT
ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్‌ గంగూలీ ఇండియాలో మొదటి డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ను నిర్వహించాడు. ఈ చారిత్రాత్మక డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ విజయవంతం అవ్వడం అందులోనే ఇండియా ఇన్నింగ్స్‌ తేడాతో గెలవడంతో జరిగింది. ఇక ఈ టెస్టు మ్యాచ్‌ అనంతరం కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్‌ గంగూలీ ట్రోఫీని బహూకరించారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో గంగూలీ పోస్ట్‌ చేశాడు.

ఆ ఫొటోలో గంగూలీ కాస్త సీరియస్‌ గా గంభీరంగా ఉన్నాడు. దాంతో ఆయన కూతురు సనా గంగూలీ ఆ ఫొటోకు కామెంట్‌ చేసింది. మీకు నచ్చనిది ఏంటీ ఎందుకు అంత సీరియస్‌ గా ఉన్నారంటూ ఆమె సరదాగా ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ పెట్టింది. సనా కామెంట్‌ కు గంగూలీ స్పందించాడు. నీ అల్లరి మరియు నీవు మాట వినక పోవడం వల్లే నేను సీరియస్‌ గా ఉన్నానంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. తండ్రి కామెంట్‌ కు సనా మరోసారి స్పందించింది. ఇది అంతా కూడా మీ నుండి వచ్చిందే కదా అంటూ కామెంట్‌ పెట్టింది.

ఈ తండ్రి కూతురు మద్య సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గంగూలీ తన కూతురుతో చాలా సరదాగా ఉంటాడు. ఈ తండ్రి కూతురుకు ఒకరంటే ఒకరికి ఎంత అభిమానమే ఈ కామెంట్స్‌ ను చూస్తుంటేనే అర్థం అవుతుందని నెటిజన్స్‌ అంటున్నారు. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించిన గంగూలీపై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News