నాన్నగారు ఎలా ఉన్నారు...వెన్నుపోటుకు ఆయనే నాకు స్పూర్తి

Update: 2022-10-19 08:50 GMT
చంద్రబాబు రాజకీయాలను ఆ తరం నుంచి ఈ తరం దాకా ఈదారు. ఆయనలో లేనిది అలుపు, గెలుపు పిలుపు కోసం వినే ఓపిక. లేకపోతే చంద్రబాబు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయిన నాటికి పవన్ కళ్యాణ్ కి పట్టు మంది పదేళ్ళు కూడా ఉండవేమో . ఇపుడు ఆయన్ని కలవడానికి బాబు విజయవాడ హొటల్ కి వచ్చారు అంటే బాబు రాజకీయ చాతుర్యం పాలిటిక్స్ ని ఆయన ఎలా డైజెస్ట్ చేసుకున్నారు అన్నది అర్ధమవుతుంది.

ఇక జనసేన  అధినేత పవన్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తో బాబు ఈ సందర్భంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన కూడా నవ్వుతూ బాబుతో ఫోటోలకు ఫోజిచ్చారు. అయితే ఈ ఫోటోలే ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు అన్నది ఎవరికీ తెలియదు కానీ సోషల్ మీడియాలో జూనియర్ నాదెండ్ల బాబు షేక్ హ్యాండ్ ఫోటో పెట్టి దిగువన మీ నాన్నగారు ఎలా ఉన్నారు...వెన్నుపోటుకు ఆయనే నాకు స్పూర్తి అని అన్నట్లుగా పెట్టిన కాప్షన్ అయితే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది

కాస్తా నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్తే 1984లో ఎన్టీయార్ కి తొలిసారి వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కరరావు. ఆయన కూడా ఆగస్ట్ నెలలోనే ఎన్టీయార్ ర్ ని గద్దె దించి సీఎం అయ్యారు. అయితే అపుడు పరిస్థితులు ఎన్టీయార్  కి కలసిరావడంతో ఆయన మళ్లీ సీఎం కాగలిగారు. అయితే నాదెండ్ల మాత్రం నెల రోజుల సీఎంగానే ఉన్నారు. ఇది చరిత్ర.

అది జరిగిన పదకొండేళ్లకు అంటే 1995లో చంద్రబాబు తన సొంత మామకు వెన్నుపోటు పొడిచారు. అయితే మొదటి వెన్నుపోటు నుంచి తేరుకున్న ఎన్టీయార్  రెండవసారి ఇక ఏ మాత్రం ఎదిరించలేక విధికి తలవంచారు, అలాగే తనువు చాలించారు. అంటే తెలుగుదేశం హిస్టరీ తీసుకుంటే ఎన్టీయార్  కి రెండు వెన్నుపోట్లు జరిగితే అందులో మొదటి పోటు నాదెండ్ల భాస్కరరావుది అన్న మాట.

ఆ విధంగా నాదెండ్ల రాజకీయ చరిత్రలో గుర్తుంటారు. ఇక నాదెండ్ల కుమారుడు చంద్రబాబు కలుసుకున్న దాఖలాలు ఎక్కడా ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇలా ఫస్ట్ టైం ఈ ఇద్దరు ఫోటో బయటకు వచ్చేసరికి టీడీపీ వెన్నుపోటు రాజకీయలను కలిపి కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలోకి వదిలేసరికి తెగ వైరల్ అయింది. అంతే కాదు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

చిత్రమేంటి అంటే నాడు సీనియర్ నాదెండ్ల ఒక సినీ నటుడి పార్టీకి కో పైలెట్ గా వ్యవహరిస్తే నేడు మరో సినీ నటుడు పవన్ పార్టీకి జూనియర్ నాదెండ్ల కో పైఎల్ట్ గా ఉన్నారు. నాడు అన్న గారికి అధికారం దక్కింది. సీనియర్ నాదెండ్ల వెన్నుపోటుకు ఆస్కారం ఏర్పడింది. ఇపుడు పవన్ కి అధికారం ఏమైనా దఖలు పడితే అపుడు చూడాలి జూనియర్ నాదెండ్ల ఎలా వ్యవహరిస్తారో అన్న సెటైర్లు కూడా ఒక వైపు ఉన్నాయి.

ఏది ఏమైనా జూనియర్ నాదెండ్ల చంద్రబాబు పిక్ మాత్రం అరుదైనదిగానే చూస్తున్నారు. ఇక నాదెండ్ల భాస్కరరావు అయితే చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూ యూట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కళ్ళ ముందు ఉన్నాయి. బాబుని ఆయన రాజకీయ వంచకుడిగా కూడా తీవ్రంగా విమర్శించారు. మరి తనయుడు మనోహర్ కి మాత్రం బాబులో ఒక దిశా నిర్దేశకుడు కనిపిస్తున్నారు అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News