వైరల్ పోస్ట్: మోడీ స్టేడియం సరే.. కాంగ్రెసోళ్లే పేర్లేంటి?

Update: 2021-02-27 14:30 GMT
స్వాతంత్ర్య సమరయోధులు పక్కకుపోయారు. దేశాన్ని పాలించిన పార్టీల ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ దేశ చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం అని నిట్టూర్చాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇటీవల గుజరాత్ లోని మొతేరా స్డేడియానికి ఉన్న 'సర్ధార్ వల్లభాయ్ పటేల్' పేరు ను తొలగించి బీజేపీ పెద్దాయన, ప్రధాని నరేంద్రమోడీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. నెటిజన్లు ఇప్పటికీ మోడీ పేరు పెట్టడంపై ట్రోల్స్ మీమ్స్ చేసి హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ మద్దతుదారులు ఊరుకుంటారా.? 'అంతకుమించి' సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతల పేర్లను పూసగుచ్చి ఏకిపారేస్తున్నారు.తాజాగా బీజేపీ, కాంగ్రెస్ యమ రంజుగా సాగుతోంది.

ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మాట్లాడుతూ 'సిగ్గు లేకుండా మోడీ స్డేడియంకు తన పేరు ఎలా పెట్టుకున్నాడో చూడండి' అంటూ విమర్శించాడు. దీంతో బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు కాంగ్రెస్ నేతల పేర్లను ఎక్కడెక్కడ ఎవరికి పెట్టారో గుర్తించి మరీ రాహుల్ పై పడిపోతున్నారు..

రాహుల్ పై బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఈ పోస్టును ఒక్కసారి పరిశీలిస్తే..

'మా పూర్వీకుడైన  తుగ్లక్ పేరు మీద ఉన్న వీధిలోని తన ఇంటి నుంచి మోతీలాల్ నెహ్రూ రోడ్డు ద్వారా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చేరుకొని అక్కడ  స్పీచ్ ఇచ్చాక.. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్ లో దిగి..  నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు లో ప్రయాణించి.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ లో జవహర్ లాల్ నెహ్రు టెక్నలజీకాల్ యూనివర్సిటీ విద్యార్థులకు వారు గెలిచిన
రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ ఇచ్చిన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ సిగ్గులేకుండా మోడీ స్టేడియంకి తన పేరు ఎలా పెట్టుకున్నాడో చూడండి అని విమర్శించారు.
Tags:    

Similar News