రూ. ప‌ది నాణేలు ర‌ద్దు చేస్తారంటూ వ‌దంతులు

Update: 2017-01-25 10:23 GMT
పెద్ద నోట్ల ర‌ద్దుతో ఉక్కిరిబిక్కి‌రి అయిన ప్ర‌జ‌ల‌ను ఇప్పుడు మ‌రో ప్ర‌చారం ఉలికిపాటుకు గురి చేస్తోంది. త్వ‌ర‌లో ప‌ది రూపాయ‌ల నాణేల‌ను కూడా ర‌ద్దు చేయ‌నున్నారంటూ త‌మిళనాడులో వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో త‌మ వ‌ద్ద ఉన్న రూ.ప‌ది నాణేల‌ను వ‌దిలించుకునేందుకు ప్ర‌జ‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.
    
అయితే.. రద్దు చేస్తారన్న ప్రచారం కారణంగా వీటిని తీసుకునేందుకు వ్యాపారులు, ఇత‌రులు విముఖ‌త చూపుతున్నారు. దీంతో ప్రజలు వాటిని ఆలయాల్లోని హుండీల్లో కానుకలుగా వేసేస్తున్నారు.
    
త‌మిళనాడులో ప్ర‌సిద్ధి చెందిన ప‌ళ‌ని మురుగ‌న్ ఆల‌యంలోని హుండీని మంగ‌ళ‌వారం అధికారులు లెక్కించగా.. అందులో  రూ.10 నాణేలు భారీ సంఖ్యలో ఉండడంతో వారు షాకయ్యారు. కొన్ని వేల సంఖ్యలో ఈ నాణేలు ఉండడం ఇంతకుముందెన్నడూ లేదని చెబుతున్నారు. వదంతుల కార‌ణంగానే ప్ర‌జ‌లు ఇలా నాణేల‌ను హుండీలో వే‌స్తున్న‌ట్టు ఆల‌య అధికారులు అంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News