టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫిట్ నెస్ గురించి అందరికీ తెలిసిందే. మైదానంలో ధనాధన్ బ్యాటింగ్ చెలరేగిపోయే ధోనీ.. ఫిట్ నెస్ కాపాడుకోవడంలోనూ అంతే శ్రమిస్తుంటాడు. అయితే.. ఎలాంటి వ్యాయామం చేస్తాడన్నది మాత్రం చాలా మందికి తెలియదు. రెగ్యులర్ జిమ్ వర్కవుట్లతోపాటు ఫుట్ బాల్ ఆడుతుంటాడు ధోనీ.
అయితే.. దాంతోపాటుగా గుర్రాలతోనూ రన్నింగ్ రేస్ పెట్టుకుంటాడీ జార్ఖండ్ డైనమైట్. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ధోనీ వైఫ్ సాక్షి. రాంచీలోని ఫామ్ హౌస్ లో ఈ రేస్ కొనసాగింది. రాంచీ శివార్లలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో అద్దిరిపోయే ఫామ్ హౌస్ ఉంది ధోనీకి.
ఇన్ స్టాలో సాక్షి పోస్ట్ చేసిన వీడియోలో.. వైట్ కలర్ లో ఉన్న షెట్లాండ్ పోనీతో పరుగు పందెంలో పాల్గొన్నాడు. ముందుగా హార్స్ పరిగెడుతుండగా.. దాన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు కెప్టెన్ కూల్. ఐపీఎల్ వాయిదా పడడంతో ఇంటి వద్దనే ఉంటున్న ధోనీ.. ఈ విధంగా ఎంజాయ్ చేస్తూనే.. ఫిట్ నెస్ కూడా చెక్ చేసుకుంటున్నాడు.
త్వరలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ టోర్నీ రీ-ఓపెన్ కాబోతుండడంతో.. ఫిట్నెస్ పెంచుకునే పనిలో పడ్డాడన్నమాట. ఈ పోస్టుకు ‘స్ట్రాంగర్.. ఫాస్టర్’ అని క్యాప్షన్ ఇచ్చింది సాక్షి. కాగా.. ధోనీ వద్ద షెట్లాండ్ పోనీతోపాటు బెల్జియం మాలినోయిస్, జర్మన్ షెపర్డ్ కూడా ఉన్నాయి. గుర్రాలను పెంచుకునే క్రికెటర్లలో ధోనీ రెండోవాడు కావడం విశేషం. రవీంద్ర జడేజాకు ఓ పెద్ద గుర్రపు శాలనే ఉండడం తెలిసిందే.
Full View