మూడు దశాబ్దాల కిందటి వరకు ఈ విశ్వం అంటే మన సౌర కుటుంబం మాత్రమే అనుకునేవారు. గ్రహాలు కేవలం తొమ్మిది మాత్రమేనని, ఇందులో భూమి మీద మాత్రమే జీవం ఉందని చదువుకున్నాం. కానీ.. ఇప్పుడు పరిస్థితి వేరు. మనలాంటి సౌర కుటుంబాలు కోటాను కోట్లు ఉన్నాయని, ఈ విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణువు మాత్రమేనని తేలింది. కాబట్టి.. మిగిలిన పాలపుంతల్లో భూమి లాంటి జీవం ఉన్న గ్రహాలు ఎన్నో ఉండచ్చనే వాదన బలపడింది.
అయితే.. ఆ జీవం ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది? అనే విషయాలపై స్పష్టత లేదు. భూ గ్రహాంతర వాసుల గురించి చర్చ వచ్చినప్పుడు మనం చర్చించుకునే ఒకే ఒక్క పేరు ఏలియన్స్. ఈ ఏలియన్స్ నిజంగానే ఉన్నారని, ఇవిగో ఆధారాలు అంటూ గతంలో పలుమార్లు చర్చల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి ఆధారం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
త్రిభుజ ఆకారంతో ఉండి, ఎగిరే ప్లేట్లుగా పిలుచుకునే.. ఫ్లయింగ్ సాసర్స్ ను ఏలియన్స్ వినియోగిస్తారని కూడా ఒక వాదన ఉంది. వాటిలో వాడే ఇంధనాలు, వగైరా వివరాలేవీ తెలియదుగానీ.. గ్రహాంతర వాసులు ఫ్లయింగ్ సాసర్స్ ద్వారానే అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు.
అలాంటి ఫ్లయింగ్ సాసర్ ఒకటి ఆకాశంలో తిరుగుతూ వీడియోకు చిక్కింది. ఇది అమెరికన్ నేవీ సిబ్బంది షూట్ చేశారని చెబుతున్నారు. అయితే.. అందులో ఉన్నది గ్రహాంతరవాసులేనా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు. ఈ వీడియో గతేడాది మే1న అమెరికన్ నేవీ నుంచి బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఏలియన్స్ ఉండొచ్చ అనే వ్యాఖ్యలు చేస్తున్నారట అమెరికన్ నేవీ అధికారులు.
కానీ.. అధికారికంగా మాత్రం ఆ ప్రకటన చేయలేకపోతున్నారు. మరి, రాబోయే రోజుల్లో ఏమైనా వెల్లడిస్తారేమో చూడాలి. ఇప్పుడు మాత్రం లీకైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.