ఈ వారం మొదట్లో పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో సుమారుగా 42 మంది మృతి చెందగా - 300మంది తీవ్రగాయాల పాలయ్యారు. దాడులతో సంబంధం ఉన్న 600మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే , గత వారం రోజులుగా అల్లర్లతో అట్టుడికిపోతున్న ఈశాన్య ఢిల్లీ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. అయినప్పటికి ఆ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రగాయాలపాలైన వారి కుటుంబాలు ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాయి. అలాగే ఆ దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ కావడం కలకలం రేపుతోంది.
తాజాగా రోడ్డుపై తీవ్రగాయాలతో పడి ఉన్న ఓ ఐదుగురిని జాతీయ గీతం పాడాలంటూ పోలీసులు హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తీవ్రగాయాలతో రోడ్డుపై పడి ఉన్న వారిని జాతీయ గీతం పాడాలంటూ పోలీసులు హింసిస్తూ, వారి చుట్టూ మూగి కర్రలతో వారిని కొడుతూ బెదిరించటం వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వీడియో లో ఉన్న ఫైజన్ అనే 23ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.
ఈ వ్యవహారం పై ఫైజన్ తల్లి స్పందిస్తూ.. ‘మా ఫైజన్‌తో పాటు మరికొంతమందిని బాగా కొట్టారు. ఫైజన్‌ను ఇనుప రాడ్లతో చితకబాదారు. కాళ్లు విరిగి పోయాయి. దెబ్బల కారణంగా అతడి శరీరం నల్లగా కమిలిపోయింది. మొదట అతడ్ని రోడ్డుపై పడేసి కొట్టారు. తర్వాత అక్కడినుంచి తీసుకుపోయారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సాయంత్రం ఫైజన్‌ను కొట్టారని తెలిసి ఆసుపత్రికి వెళ్లాను. అతడక్కడ లేడు. వెంటనే జ్యోతి కాలనీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడ ఎంత బ్రతిమిలాడినా కూడా తన కొడుకుని కలవనీయలేదు. మళ్లీ మరోసారి మరుసటి రోజు ఉదయం వెళ్లి పోలీసులని అడిగాను , అయినా వారు నా మాటలు లెక్కచేయలేదు. ఇక చివరగా ఫైజన్ చనిపోయే సమయంలో మాకు సమాచారం ఇచ్చారు. నేను వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించాను. అక్కడ చికిత్స పొందుతూ ఫైజన్ చనిపోయాడు. అసలు నా కొడుకు మాకు సమాచారం ఇచ్చారు. నేను వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించాను. అక్కడ చికిత్స పొందుతూ ఫైజన్ ఢిల్లీ అల్లర్లలో పాల్గొనలేదు అని, అన్యాయంగా తన కొడుకుని పొట్టనపెట్టుకున్నారు అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.