స్కూల్ టాయిలెట్లను ఖాళీ చేతులతో శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ

Update: 2022-09-24 04:42 GMT
నాయకులు అన్నంతనే మనకో భావన మనసులో మెదులుతుంది. అందుకు తగ్గట్లే మన చుట్టూ ఉన్న వారు కనిపించటంతో.. నాయకులంతా ఇలానే ఉంటారన్న భావన ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఊహకు కూడా అందని రీతిలో వ్యవహరించే నేతలు కొందరు ఉంటారు.

ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందింది. లోక్ సభ సభ్యుడిగా ఉంటూ.. సర్కారు స్కూళ్ల టాయిలెట్ల క్లీనింగ్ అంటే.. అదో ప్రచార అస్త్రంగా మార్చుకోవటం తెలిసిందే.

చేతులకు పొడువుగా ఉండే గ్లౌజ్ లు వేసుకొని.. బ్రాండెడ్ బ్రష్ పట్టుకొని.. టాయిలెట్లు క్లీన్ చేస్తున్నట్లుగా కెమేరాలకు ఫోజులు ఇచ్చి.. మమ అనిపించే వారికి భిన్నంగా ఇప్పుడు చెప్పే బీజేపీ ఎంపీ. చేతులకు ఏమీ వేసుకోకుండా.. బ్రష్ లాంటిది పట్టుకోకుండా ఉత్త చేతలతో.. సర్కారీ స్కూల్ టాయిలెట్లను కడిగేసిన వైనం షాకింగ్ గా మారింది. వంట పాత్రల్ని ఎలా అయితే.. చేతలతో కడిగేస్తామో.. అదే రీతిలో టాయిలెట్లను కడిగిన ఆయన తీరుకు అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి.

బీజేపీకి చెందిన ఈ మధ్యప్రదేశ్ ఎంపీ తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన పేరు ఏమంటే జనార్థన్ మిశ్రా. పిల్లల టాయిలెట్లను క్లీన్ చేసిన సదరు ఎంపీ.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా సేవా పఖ్ వాడా కార్యక్రమాన్ని చేపట్టింది బీజేపీ యువ మోర్చా నేతలు. మోడీ పుట్టిన రోజైన సెప్టెంబరు 17న మొదలైన ఈ కార్యక్రమం అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతి వరకు సాగనుంది.

ఇంతకూ ఈ బీజేపీ ఎంపీ ఈ పని ఎందుకు చేశారన్న విషయంలోకి వెళితే.. తన నియోజకవర్గం పరిధిలోని ఖట్కారి బాలికల స్కూల్ లో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి బాత్రూంల్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ ఏ మాత్రం శుభ్రంగా లేకపోవటంతో అప్పటికప్పుడు.. ఉత్త చేతలతో టాయిలెట్ సింక్ ను శుభ్రం చేసే పనిలో పడటంతో.. మిగిలిన వారంతా షాక్ తిన్నారు.

పరిసరాల్ని శుభ్రం చేసుకోవటం ప్రతి ఒక్కరి భాద్యగా చెప్పిన ఆయన.. గాంధీ.. మోడీ ఇచ్చిన నినాదాల్ని గుర్తు చేసుకోవాలన్నారు. అంతేకాదు.. ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమంలో తాను పాల్గొనటం మొదటిసారేమీ కాదన్న ఆయన మాటలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News