మోడ్రెన్ సప్తపది : అగ్నిహోత్రం చుట్టూ ‘ఏడు అడుగులు’ కాదు ‘ ఏడు స్టెప్పులు’
భారతీయ హిందూ సాంప్రదాయ వ్యవస్థలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పెళ్లిలో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. పెళ్లిలో రెండు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అవి మూడు ముళ్ళు, ఏడు అడుగులు. ఇక తాళి కట్టిన అనంతరం వధూవరులు హోమం చూట్టూ ఏడూ ప్రదక్షణలు ఎందుకు చేస్తారంటే ఏడూ అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడూ జన్మల వరకు తోడు ఉంటాననే నమ్మకం ఇవ్వడం కోసమేనని చెబుతారు. అంతేకాకుండా ఇందులో ఒక్కో అడుగు వెనుక ఒక్కో అర్ధం కూడా ఉంది.
అయితే , అప్పటి రోజుల్లో పెళ్లి కూతుర్లు సిగ్గు తో పెళ్లి పీటల పై కూర్చున్నా కూడా తల పైకి ఎత్తేవారే కాదు. కానీ , ఈ రోజుల్లో పెళ్లిలో పెళ్లి కూతుర్లు చేసే హడావిడే ఎక్కువ. అటువంటి ఓ మోడ్రన్ పెళ్లి కూతురు తమ పెళ్లి జరిగిన తరువాత అగ్నిహోత్రం చుట్టూ నడిచే సప్తపది లో కూడా డ్యాన్సులు వేసింది. అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు కాదు ఏకంగా ఏడు స్టెప్పులు వేసింది భర్తతో సహా..పెళ్లికూతురు డ్యాన్సులు వేసుకుంటూ ముందు నడుస్తుంటే ఆమె వెనకే వరుడు కూడా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరిగాడు. పెళ్లిలో వధూవరుల్దిరూ కలిసి అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సప్తపదిలో భాగంగా వధూవరులిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం అనేది ఓ ఆనవాయితీ. ఈ వేడుకలో వధూవరులు నృత్యం చేస్తుంటే అతిథులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో కామెంట్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Full View
అయితే , అప్పటి రోజుల్లో పెళ్లి కూతుర్లు సిగ్గు తో పెళ్లి పీటల పై కూర్చున్నా కూడా తల పైకి ఎత్తేవారే కాదు. కానీ , ఈ రోజుల్లో పెళ్లిలో పెళ్లి కూతుర్లు చేసే హడావిడే ఎక్కువ. అటువంటి ఓ మోడ్రన్ పెళ్లి కూతురు తమ పెళ్లి జరిగిన తరువాత అగ్నిహోత్రం చుట్టూ నడిచే సప్తపది లో కూడా డ్యాన్సులు వేసింది. అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు కాదు ఏకంగా ఏడు స్టెప్పులు వేసింది భర్తతో సహా..పెళ్లికూతురు డ్యాన్సులు వేసుకుంటూ ముందు నడుస్తుంటే ఆమె వెనకే వరుడు కూడా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిరిగాడు. పెళ్లిలో వధూవరుల్దిరూ కలిసి అగ్ని హోత్రం చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సప్తపదిలో భాగంగా వధూవరులిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయడం అనేది ఓ ఆనవాయితీ. ఈ వేడుకలో వధూవరులు నృత్యం చేస్తుంటే అతిథులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలమంది వీక్షించగా వేలల్లో కామెంట్ చేస్తున్నారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.