కొత్త దంపతులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే..ఈ సమావశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఏ ఫేమస్ ఫొటో - వీడియో బయటకు వచ్చినా.. దానికి కాస్త తమ క్రియేటివిటీని జోడించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అది కాస్తా వైరల్ అయిపోతోం. తాజాగా పెళ్లి తర్వాత తాము ఇచ్చే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడానికి మోడీ దగ్గరకు కోహ్లి - అనుష్క వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఫొటోలకూ - మొన్న గుజరాత్ ఎన్నికలకు లింక్ పెట్టేశారు. బీజేపీకి 99 సీట్లు రావడానికి లింకు పెట్టేసి `99 మీద ఔటైతే ఎలా.. సెంచరీలు ఇలా చేయండి` అని మోడీకి కోహ్లికి సలహాలు ఇచ్చినట్లుగా నెటిజన్లు క్రియేట్ చేశారు. మోడీకి తమ ఆధార్ - పాన్ కార్డులు - కేవైసీ సర్టిఫికెట్లను కొత్త దంపతులైన విరాట్-అనుష్కలు అందజేస్తున్నారని ఇంకొందరు పంచ్ లు పేలుస్తున్నారు. మరికొందరు అయితే....ఏడాది కింద జరిగిన నోట్ల రద్దును ప్రస్తావిస్తున్నారు. విరాట్ అనుష్కలు రద్దైన రూ.500 - రూ.1000 నోట్లను మార్చుకుంటున్నారని ట్రోల్ చేశారు.
కాగా, ఇటలీలో జరిగిన విరాట్ కోహ్లీ - అనుష్క వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది స్నేహితులు - సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈనెల 21న న్యూఢిల్లీలో - 26న ముంబయిలో రిసెప్షన్ ఇవ్వడానికి వీరు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, తమ పెళ్లి మిలన్ (ఇటలీ)లోని ఒక ప్రైవేటు రిసార్ట్ లో జరిగిందని కోహ్లీ - అనుష్క ట్విటర్ ద్వారా సమాచారమిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫొటోలను కూడా వారు సోషల్ మీడియాలో ఉంచారు. దీనిపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఫన్నాలాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో డబ్బులు సంపాదించి విదేశాల్లో ఖర్చు పెడతారా అని ఆయన విమర్శించారు. ఇలాంటి తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.