ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడం క్రికెట్ లో సహజమే. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ విషయంలో ముందుంటారు. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్లు కూడా ఇటీవల గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా కౌంటర్లు ఇవ్వడంలో కోహ్లీ ముందుంటున్నారు. శనివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లోనూ బట్లర్, టీ మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియా లో వైరల్ గా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. టీ మిండియా చెలరేగి ఆడటంతో భారీ స్కోరు సాధించింది. తర్వాత జరిగిన ఇంగ్లండ్ ఇన్సింగ్స్ లో కోహ్లీకి, బట్లర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో భువనేశ్వర్ వేసిన బంతిని బట్లర్ లాంగాఫ్ లోకి షాట్ కొట్టాడు. అయితే ఈ బంతిని హార్థిక్ పాండ్యా అందుకోవడంతో బట్లర్ అవుటయ్యాడు. అప్పటికే 54 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్న బట్లర్ అవుట్ కావడంతో టీమిండియా సంబురాల్లో మునిగిపోయింది.
ఈ సందర్భంగా కోపంలో ఉన్న బట్లర్.. కోహ్లీని ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లీ కూడా సీరియస్ గా బట్లర్ వైపు దూసుకొచ్చాడు. అనంతరం పెవిలియన్ కు వెళుతూ బట్లర్ వెనక్కి తిరిగి కోహ్లీ వైపు కోపంగా చూశాడు. దీంతో కోహ్లీ కూడా అతడికి దీటుగా జవాబు చెప్పాడు. కోహ్లీ ఏదో గట్టిగా అరిచినట్టు ఆ వీడియోలో స్పష్టం అవుతున్నది. ఆ తర్వాత బట్లర్ వెళ్లిపోవడంతో వివాదం ముగిసింది. అనంతరం అంపైర్ నితిన్ మీనన్ తో మాట్లాడిన కోహ్లి తనకు, బట్లర్ ల మధ్య జరిగిన సంభాషణ గురించి చర్చించినట్లు తెలిసింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే జేసన్ రాయ్ డకౌట్ గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన మలాన్ తో కలిసి రెండో వికెట్ కు బట్లర్ 130 పరుగులు జోడించి విజయం వైపు నడిపించాడు. 130 పరుగుల వద్ద బట్లర్ వెనుదిరగడంతో మ్యాచ్ టీమిండియా వైపు టర్న్ అయింది. ఇక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవరల్లో 2వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అనంతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది.