టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో గొప్ప మైలురాయికి చేరుకున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా భారతీయ స్టార్ క్రికెటర్ అవతరించాడు. ఈ ఘనతతో కోహ్లీ దిగ్గజ క్రీడాకారులైన క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, బెయోన్స్, నేమార్ జూనియర్, డ్వేన్ జాన్సన్ మరియు ఇతరుల సరసన చేరాడు. కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వంద మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన ప్రపంచం మొత్తం మీద 23వ ప్రముఖుడు కావడం విశేషం.
విరాట్ ఫాలోవర్స్ ను పోల్చి చూస్తే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ట్విట్టర్లో విరాట్ కు నలభై మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. విరాట్ ఫాలోవర్స్ సంఖ్య ప్రతిరోజూ గడిచేకొద్దీ పెరుగుతూనే ఉంటోంది. కరోనా లాక్ డౌన్ కాలంలో ఇది మరింత ఎక్కువగా పెరిగింది.
విరాట్ తరువాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారిలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్ లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల మంది ఫాలోవర్లు వీరికి ఉన్నారు.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం భారత కెప్టెన్ ప్రాక్టీసులో మునిగిపోయాడు. ఇంత మంది ఫాలోవర్స్ కు చేరుకున్న కోహ్లీని పలువురు అభినందిస్తున్నారు.