ఇండియా పిచ్‌లపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన రీతిలో స్పందించారు. విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మొతేరా పిచ్ వేదిక గా జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగియడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిచ్ అధ్వానంగా ఉందని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓడి పోయింది. అప్పుడు కూడా కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. అప్పుడెవరూ పిచ్ గురించి మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు ఇండియా గెలిచేసరికి పిచ్ ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. అప్పుడేమో ఇండియన్ బ్యాట్స్‌మన్ ఫెయిల్ అయ్యారు.. అన్నారు. ఇప్పుడు పిచ్‌లు బాగాలేవు అంటున్నారు.. ఇదేం ద్వంద్వ నీతి అంటూ విరాట్ కోహ్లీ స్పందించారు.భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విరాట్ మీడియాతో మాట్లాడారు. ‘మ్యాచ్ ఎవరైనా గెలవడం కోసం ఆడతారు.. అంతేకాని ఐదురోజులు ఆడాలని ఆడరు. మ్యాచ్ ను నిలబెట్టడం బ్యాట్స్‌మెన్ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని పిచ్ ల గురించి ప్రస్తావన తేవడం అంటే అది సాకులను వెదకడం మాత్రమే’ అని విరాట్ అన్నారు. పిచ్ ల గురించి పదే పదే ప్రస్తావన తీసుకు రావడం మంచిది కాదని విరాట్ పేర్కొన్నారు.